అక్షరటుడే, వెబ్‌డెస్క్ : EX MLA Jeevan Reddy | పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు వెడేక్కాయి. తమ పార్టీల మద్దతుదారులను గెలిపించుకోవడానికి కీలక నేతలు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
ఆర్మూర్ (Armoor) మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో ఎక్కడైనా అధికారులు ప్రజలను పైసలు అడిగితే భయపడొద్దని సూచించారు. తనకు సమాచారం ఇవ్వాలన్నారు. ఆర్మూర్ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలోని గల తన ఇల్లు ఇకపై ప్రజల కోసం ‘జనతా గ్యారేజ్’ (Janata Garage)గా మారుతుందని తెలిపారు. ప్రజల సమస్యలు, అధికారుల అవినీతి ఫిర్యాదులు తీసుకుంటామన్నారు. తానే వచ్చి అక్కడ కూర్చుంటానని చెప్పారు.
జనతా గ్యారేజీలో ఛార్జీషీట్ ఫైల్ చేస్తాం, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామన్నారు. అధికారుల పేర్లను పింక్‌బుక్‌లో ఎక్కిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ బీఆర్ఎస్ (BRS) అధికారంలోకి రాగానే అవినీతి అధికారులందరి లెక్కలు తేల్చి, వసూలు చేస్తామని హెచ్చరించారు.
EX MLA Jeevan Reddy | పల్లెపోరు కోసం..
పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ శ్రమిస్తోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఇతర పార్టీల నాయకులను చేర్చుకుంటున్నారు. అలాగే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారు. కొంతకాలంగా ప్రజలకు దూరంగా ఉన్న నాయకులు సైతం, తాజాగా ఎన్నికల నేపథ్యంలో మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఈ ఎన్నికల్లో తమ అనుచరులను గెలిపించుకోడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
