అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jaggareddy | కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జీవితంలో తాను సంగారెడ్డి ఎమ్మెల్యే (Sangareddy MLA)గా పోటీ చేయనని తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) జగ్గారెడ్డి సంగారెడ్డి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ క్రమంలో తాజాగా మాట్లాడుతూ… తన కోసం రాహుల్ గాంధీ (Rahul Gandhi) వచ్చి ప్రచారం చేసినా ఓడించారన్నారు. రాహుల్‌ని పిలిచి అవమానించానమో అని ఫీలైనట్లు పేర్కొన్నారు. తన ఓటమికి ఇక్కడి మేధావులే కారణమని జగ్గారెడ్డి ఆరోపించారు. సంగారెడ్డిలో తన భార్య నిర్మల పోటీ చేసినా కూడా ప్రచారంలో పాల్గొనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా ప్రచారం చేస్తానని, సంగారెడ్డిలో మాత్రం చేయనని తెలిపారు.
Jaggareddy | ఆమె పోటీ చేస్తారా
జగ్గారెడ్డి కౌన్సిలర్‌గా బీజేపీ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ ఛైర్మన్, ఎమ్మెల్యే అయ్యారు. 2004లో ఆయన బీఆర్ఎస్ నుంచి సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన.. 2018లో విజయం సాధించారు. అయితే 2023 ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చినా జగ్గారెడ్డి ఓడిపోయారు. కొంతకాలంగా సంగారెడ్డిలో తన భార్య పోటీ చేస్తారని జగ్గారెడ్డి అంటున్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో ఆమెను పోటిలో దింపడానికి యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తాజా వ్యాఖ్యలు చేశారని సమాచారం.