అక్షరటుడే, ఇందూరు : Duddolla Giribabu | తనను ఆశీర్వదించి కార్పొరేటర్‌గా గెలిపిస్తే ఎళ్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని 47వ డివిజన్ బీజేపీ అభ్యర్థి (BJP Candidate) దుద్దోళ్ల గిరిబాబు అన్నారు. ఈ మేరకు అంగడిబజార్‌లో శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
Duddolla Giribabu | బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం..
నగరంలో బీజేపీతోనే (BJP) అభివృద్ధి సాధ్యమవుతుందని గిరిబాబు అన్నారు. ఈ సందర్భంగా కాలనీల ప్రజలతో మాట్లాడుతూ.. వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. అలాగే ఒక్కసారి అవకాశమివ్వాలని ఓటర్లను అభ్యర్థించారు. బీజేపీ ఆధ్వర్యంలో డివిజన్‌ను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
Duddolla Giribabu | ఎంపీ, ఎమ్మెల్యే సహకారంతో..
ఎంపీ అర్వింద్ (MP Arvind), ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ (MLA Dhanpal Suryanarayana) సహకారంతో డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు విశేషంగా కృషి చేస్తానని గిరిబాబు తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం (BJP Government) అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. ‘మన ఇందూరు–మన మేయర్’ నినాదంతో ఓట్లు అడుగుతున్నామని.. బీజేపీతోనే నగరానికి ప్రత్యేక గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
