అక్షరటుడే, ఇందూరు: BJP candidate Koradi Kiran | నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని (Nizamabad Municipal Corporation) 52వ డివిజన్ అభివృద్ధికి పాటుపడతానని బీజేపీ అభ్యర్థి కోరడి కిరణ్ (Koradi Kiran) హామీ ఇచ్చారు. బుధవారం డివిజన్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డు సభ్యులతో కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాను గెలుపొందిన అనంతరం సమస్యల పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎంపీ అర్వింద్ (MP Arvind), ఎమ్మెల్యే ధన్పాల్ సూరనారయణ గుప్తా సహకారంతో డివిజన్‌కు నిధులు మంజూరు చేయించి.. అభివృద్ధి పనులు చేపడతానని చెప్పారు.
BJP candidate Koradi Kiran | బీజేపీతోనే అభివృద్ధి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని కోరడి కిరణ్ వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) నేతృత్వంలోనే కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని వివరించారు. ఉచిత గ్యాస్ కనెక్షన్, ఆయుష్మాన్ భారత్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజనలు తదితర పథకాలతో పేదలకు మేలు చేస్తోందన్నారు. అలాగే మరోవైపు దేశాభివృద్ధికి ఎంతగా పనిచేస్తోందన్నారు.
డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి
నగరంలోని 52వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు పని చేస్తానని కోరడి కిరణ్ తెలిపారు. నగరంలోని అత్యధిక స్థానాల్లో బీజేపీ గెలుపొంది మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. దీంతో డివిజన్ అభివృద్ధికి నిధులు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు తనకు ఓటు వేసి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేవారు. ఆయన వెంట బీజేపీ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ ప్రజలు ఉన్నారు.