CPI Narayana | నేను ఐబొమ్మలో సినిమాలు చూశా.. సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CPI Narayana | సీపీఐ సీనియర్​ నాయకుడు నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమాలను పైరసీ చేసి ఐబొమ్మ వెబ్​సైట్లో​ (iBomma Website) అప్​లోడ్​ చేస్తున్న ఇమ్మడి రవిని పోలీసులు ఇటీవల అరెస్ట్​ చేసిన విషయం తెలిసిందే. దీనిపై నారాయణ స్పందించారు. ఐబొమ్మ వెబ్​సైట్​లో ఎంతో మంది సినిమాలు చూసేవారు. తాను కూడా ఐబొమ్మలో సినిమాలు ఫ్రీగా చూశానని నారాయణ పేర్కొన్నారు. రూ.ఆరేడు వందలు పెట్టి ఎలా చూసేది అని ఐబొమ్మలో […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CPI Narayana | సీపీఐ సీనియర్​ నాయకుడు నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమాలను పైరసీ చేసి ఐబొమ్మ వెబ్​సైట్లో​ (iBomma Website) అప్​లోడ్​ చేస్తున్న ఇమ్మడి రవిని పోలీసులు ఇటీవల అరెస్ట్​ చేసిన విషయం తెలిసిందే. దీనిపై నారాయణ స్పందించారు.

ఐబొమ్మ వెబ్​సైట్​లో ఎంతో మంది సినిమాలు చూసేవారు. తాను కూడా ఐబొమ్మలో సినిమాలు ఫ్రీగా చూశానని నారాయణ పేర్కొన్నారు. రూ.ఆరేడు వందలు పెట్టి ఎలా చూసేది అని ఐబొమ్మలో చూశానని చెప్పారు. కాగా చాలా మంది నాయకులు, అధికారులు సైతం ఐబొమ్మలో సినిమాలు చూసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే నారాయణ మాత్రం తాను చూశానని చెప్పడం గమనార్హం. అద్భుతమైన తెలివితేటలు ఉన్న రవి (Immad Ravi) అలా మారడానికి ఈ వ్యవస్థలే కారణమని ఆయన పేర్కొన్నారు. వ్యవస్థలో లోపాలను సరిచేయకుండా ఉంటే ఇలాంటి రవిలే పుట్టుకు వస్తారన్నారు.

CPI Narayana | వెయ్యి మంది హిడ్మాలు పుడతారు

ఆంధ్రప్రదేశ్​లోని మారేడ్​మిల్లి (Maredumilli) అటవీ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఎన్​కౌంటర్​ మావోయిస్ట్​ కీలక నేత హిడ్మా మృతి చెందిన విషయం తెలిసిందే. ఒక హిడ్మా చనిపోతే వెయ్యి మంది పుడతారని నారాయణ అన్నారు. అలాగే ఒక ఐబొమ్మ రవిని చంపితేనో, జైల్​లో వేస్తేనో మరో 100 మంది వస్తారని వ్యాఖ్యానించారు.

CPI Narayana | వారిని ఉరితీయాలి

ఇమ్మడి రవిని ఉరి తీస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పారు. సినిమా మాఫియాను ఉరితీస్తే సమాజానికి మేలు జరుగుతుందన్నారు. నిర్మాతలు రూ.కోట్లు ఖర్చు పెట్టి టికెట్​ ధరల పెంపు కోసం ప్రభుత్వాలను అడుక్కుంటున్నారని విమర్శించారు. సామాన్య ప్రజలను దోచుకోవడానికి ప్రభుత్వాలు సైతం సాయం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. నారాయణ రెండు నెలల క్రితం సీపీఐ జాతీయ కార్యదర్శి పదవి నుంచి తప్పుకున్నారు. తనకు 75 ఏళ్లు నిండడంతో పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పార్టీ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్‌గా ఆయన కొనసాగుతున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...