Homeతాజావార్తలుMedak | భర్త లేని లోకంలో ఉండలేనని.. కుమారుడితో కలిసి యువతి ఆత్మహత్య

Medak | భర్త లేని లోకంలో ఉండలేనని.. కుమారుడితో కలిసి యువతి ఆత్మహత్య

భర్త లేని లోకంలో తాను ఉండలేనని ఓ యువతి కుమారుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. మెదక్​ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Medak | రాష్ట్రంలో ఇటీవల ఆత్మహత్యలు పెరిగాయి. చిన్న చిన్న కారణాలతో చాలా మంది తనువు చాలిస్తున్నారు. కష్టాలను ఎదురొడ్డి నిలబడకుండా నేటి యువతరం ప్రాణాలు తీసుకుంటుంది. ముఖ్యంగా ఇటీవల కొందరు తమ పిల్లలను చంపి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.

మెదక్​ జిల్లా (Medak District)లో ఓ యువతి తన కుమారుడిని చంపి ఆత్మహత్యకు పాల్పడింది. చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్ గ్రామానికి (Khajapur Village) చెందినప్రవీణ్‌గౌడ్, అఖిల (25) దంపతులు కూలీ చేసుకుంటూ బతికేవారు. వీరికి ఒక కుమారుడు శ్రియాన్​ గౌడ్​ (2) ఉన్నారు. ఏడాది క్రితం అనారోగ్య సమస్యతో ప్రవీణ్​ గౌడ్​ చనిపోయాడు. దీంతో అప్పటి నుంచి అఖిల తీవ్ర మనోవేదనకు గురి అవుతోంది. నిత్యం తన భర్తను తలుచుకొని మనస్తాపానికి గురయ్యేది.

Medak | రెండో పెళ్లి చేసుకోమన్నా..

భర్త చనిపోయిన తర్వాత అఖిల అత్తామామలతో కలిసి ఉంటుంది. అయితే ఆమె నిత్యం బాధ పడుతుండటంతో రెండో పెళ్లి చేసుకోవాలని వారు సూచించారు. అయినా వినకుండా ప్రవీణ్ జ్ఞాపకాలతో బాధపడుతూ ఉండేదని స్థానికులు పేర్కొన్నారు. ఈ క్రమంలో మంగళవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో తన కుమారుడికి ఉరి వేసి, తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అత్త జమున కొద్ది సేపటికి ఇంటికి వచ్చింది. అఖిల ఎంతకు తలుపులు తీయకపోవడంతో స్థానికుల సాయంతో బద్దలు కొట్టి చూడగా ఇద్దరు చనిపోయి ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Must Read
Related News