ePaper
More
    Homeజిల్లాలుహైదరాబాద్Hydraa | వరద ముప్పు ప్రాంతాలను సందర్శించిన హైడ్రా కమిషనర్

    Hydraa | వరద ముప్పు ప్రాంతాలను సందర్శించిన హైడ్రా కమిషనర్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | నగరంలో వరద ముప్పు ఉన్న పలు ప్రాంతాలను హైడ్రా కమిషనర్ (Hydra Commissioner) రంగనాథ్ పరిశీలించారు. గురువారం వేకువ జామున కురిసిన భారీ వర్షాలకు (Heavy Rains) వరద ముంచెత్తిన డోయన్స్ కాలనీ, లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి ప్రాంతాలను పరిశీలించారు.

    ఎగువ నుంచి వచ్చిన వరద సాఫీగా గోపి చెరువుకు చేరే మార్గం లేక శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయం రోడ్డు, కాలనీని వరద ముంచెత్తింది. వర్షం నీరు, గోపి చెరువు నుంచి వచ్చిన వరదతో లింగంపల్లి అండర్ పాస్ లో నీరు నిలిచిందని స్థానికులు వివరించారు. అంతకు ముందు వరద ముప్పు ఉన్న కొండపూర్​లోని కాసోరోస్ అపార్ట్​మెంట్​ పరిసరాలను ఆయన తనిఖీ చేశారు. వరద, మురుగు కాల్వలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని అధికారులకు సూచించారు. అనంతరం బాచుపల్లిలో పలు వరద కాల్వలను పరిశీలించారు. చెన్నం చెరువు నుంచి వచ్చే వరద రామచంద్రాపురం కాలనీలో నిలవకుండా దిగువన ఉన్న బాచుపల్లి చెరువులోకి చేరేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

    Hydraa | వరద ముప్పునకు పరిష్కారం

    ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల మేరకు నగరంలోని రాజేంద్రనగర్ (Rajendra Nagar) మండలంలోని ఉప్పరపల్లి, శాస్త్రిపురం, పల్లె చెరువు ప్రాంతాలను కమిషనర్​ సందర్శించారు. ఉప్పరపల్లిలోని అశోక్ విహార్ కాలనీలో మురుగు, వరద కాల్వలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలను సందర్శించారు. ఎగువ నుంచి వచ్చే వరదలతో దాదాపు ఐదు అపార్ట్​మెంట్లలో నివాసం ఉంటున్న 400 కుటుంబాలు ఏడేళ్లుగా అవస్థలు పడుతున్నాయి. ఈ విషయాన్ని కమిషన్​ దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో స్పందించిన ఆయన వరద నీరు పోయేలా ఆయన కాలువ తవ్వించారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

    More like this

    India-Pakistan | మ‌రో నాలుగు రోజుల్లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌.. ఇంకా అమ్ముడుపోని టిక్కెట్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : India-Pakistan | అంతర్జాతీయ క్రికెట్‌(International Cricket)లో హై వోల్టేజ్‌గా పేరొందిన భారత్ vs పాకిస్తాన్...

    Apple iPhone 17 | ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ఐఫోన్ 17 సిరీస్ విడుదల.. అతి సన్నని మొబైల్ ఫీచర్లు, ధర వివ‌రాలు ఇవే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Apple iPhone 17 | టెక్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న Apple iPhone...

    High Court | పవన్‌ కల్యాణ్‌ ఫొటోలు పెట్టొద్దు.. హైకోర్ట్‌లో పిల్ దాఖ‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : High Court | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో చట్టబద్ధమైన అనుమతి లేకుండా ఉప ముఖ్యమంత్రి...