అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jadcharla MLA | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) వ్యాఖ్యలకు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్‌కే ఆంధ్ర వాళ్ల దిష్టి తగిలిందేమో అన్నారు.
పవన్ కల్యాణ్ ఇటీవల కోనసీమ జిల్లా (Konaseema District)లో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వాళ్ల నర దిష్టి తగిలి కొబ్బరి చెట్లు పాడు అయ్యాయని వ్యాఖ్యలు చేశారు. వీటిపై తాజాగా అనిరుధ్‌రెడ్డి (Jadcharla MLA Anirudh Reddy) స్పందించారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉండి పవన్ కల్యాణ్ అలా మాట్లాడటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు బాగుండకూడదు అని తెలంగాణ వాళ్లు నిజంగానే అనుకుంటే హైదరాబాద్‌లో ఉండగలుగుతారా అని ప్రశ్నించారు.
Jadcharla MLA | భూములు దోచుకుంటున్నారు
తెలంగాణ ప్రభుత్వ భూములను దోచుకునేదే ఆంధ్ర వాళ్లేనని ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్ళ లాగా ఒకరి కాళ్ళు పట్టుకోలేం, లంచాలు ఇచ్చి పని చేసుకోలేం అన్నారు. తెలంగాణ వాళ్లు ముక్కుసూటి మనుషులని చెప్పారు. తెలంగాణ (Telangana) వాళ్ల దిష్టి తగిలితే ఇక్కడ సినిమాలు ఎందుకు రిలీజ్ చేస్తున్నారని ప్రశ్నించారు. ప్లాఫ్ అయిన సినిమాలను కూడా ఫ్యాన్‌గా హిట్ చేయడానికి చూస్తున్నామన్నారు. “మా బతుకేదో మేము బతుకున్నాం.. మా గురించి ఎందుకు మాట్లాడుతున్నారని” అన్నారు. తెలంగాణ వచ్చాక కూడా ఆంధ్ర వాళ్లే బాగు పడ్డారని చెప్పారు.
Jadcharla MLA | వాళ్లని టార్గెట్ చేస్తా
తాను తప్పు చేసిన వాళ్లని తాను టార్గెట్ చేస్తానని అనిరుధ్‌రెడ్డి స్పష్టం చేశారు. పవన్‌కల్యాణ్ హైదరాబాద్ (Hyderabad)లో ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు. వెళ్లి విజయవాడలో ఉండాలన్నారు. తెలంగాణ వాళ్లు అందరు బాగుండాలని కోరుకుంటారని చెప్పారు. ఏపీ వాళ్లు బాగుపడొద్దని తాము అనుకోలేదన్నారు.
