Hyderabad | చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్‌గా శున‌కం.. హైద‌రాబాద్ స్టార్ట‌ప్ తీసుకున్న నిర్ణ‌యానికి షాక్

అక్షరటుడే, వెబ్​డెస్క్​:Hyderabad | హైదరాబాద్‌కు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ(Startup Company) విచిత్ర నిర్ణ‌యం తీసుకొని అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. త‌మ ఆఫీసులో ఉద్యోగుల ఆనందం రెట్టింపు చేయ‌డంతో పాటు సానుకూల వాతావ‌ర‌ణం సృష్టించేందుకు గాను గోల్డెన్ రిట్రీవర్ జాతి(Golden Retriever Breed)కి చెందిన శునకాన్ని ఉన్నత పదవిలో నియమించడం జ‌రిగింది. డెన్వర్(Denver) అనే ఈ ముద్దుల శునకం ఇప్పుడు ఆ సంస్థకు “చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్ (సీహెచ్‌ఓ)”గా CHO వ్యవహరిస్తోంది. హార్వెస్టింగ్ రోబోటిక్స్ అనే ఈ స్టార్టప్ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​:Hyderabad | హైదరాబాద్‌కు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ(Startup Company) విచిత్ర నిర్ణ‌యం తీసుకొని అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. త‌మ ఆఫీసులో ఉద్యోగుల ఆనందం రెట్టింపు చేయ‌డంతో పాటు సానుకూల వాతావ‌ర‌ణం సృష్టించేందుకు గాను గోల్డెన్ రిట్రీవర్ జాతి(Golden Retriever Breed)కి చెందిన శునకాన్ని ఉన్నత పదవిలో నియమించడం జ‌రిగింది. డెన్వర్(Denver) అనే ఈ ముద్దుల శునకం ఇప్పుడు ఆ సంస్థకు “చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్ (సీహెచ్‌ఓ)”గా CHO వ్యవహరిస్తోంది. హార్వెస్టింగ్ రోబోటిక్స్ అనే ఈ స్టార్టప్ సంస్థ, వ్యవసాయంలో రైతులు మరింత స్థిరమైన పద్ధతుల్లో పంటలు పండించ‌డానికి వీలుగా లేజర్-వీడింగ్ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తోంది.

Hyderabad | ఫ్రెండ్లీ సీహెచ్ ఓ..

అయితే ఈ సంస్థ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు రాహుల్ ఆరెపాక‌(Rahul Arepaka).. త‌న ఇన్‌స్టా ద్వారా త‌మ బృందంలో కొత్తగా చేరిన డెన్వ‌ర్ గురించి చెప్పుకొచ్చాడు. “మా కొత్త నియామకం, డెన్వర్ Denver … చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్(Chief Happiness Officer). ఇతను కోడింగ్ చేయడు. దేని గురించీ పెద్దగా పట్టించుకోడు. కేవలం ఆఫీస్‌కు మాత్ర‌మే వస్తాడు, అందరి మనసుల‌ని మాత్రం దోచేస్తాడు, వాతావరణాన్ని ఉత్సాహంగా ఉంచుతాడు. అంతేకాకుండా, మేము ఇప్పుడు అధికారికంగా పెట్-ఫ్రెండ్లీ ఆఫీస్‌గా మారాము. ఇది మేము తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం.మ‌రో ముఖ్య విష‌యం ఏంటంటే.. మా కంపెనీలో అత్యుత్త‌మ సౌక‌ర్యాలు అత‌నికే ఉన్నాయి అంటూ రాహుల్ ఆరెపాక పేర్కొన్నారు. రాహుల్ పెట్టిన ఈ పోస్ట్‌కు వేల సంఖ్యలో లైకులు, అంతకు మించి ప్రేమపూర్వక అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఇలాంటి సీహెచ్‌ఓ(CHO)లను ఇతర కంపెనీలు కూడా నియమించుకుంటే బాగుంటుంద‌ని కొంద‌రు నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మ‌ధ కాలంలో కంపెనీలు ఉద్యోగుల శ్రేయస్సు, ఒత్తిడి తగ్గించడం, నైతిక స్థైర్యాన్ని పెంచేందుకు అనేక రూప‌క‌ల్ప‌న‌లు చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే తమ కార్యాలయాలను పెంపుడు జంతువులకు అనుకూలంగా (పెట్-ఫ్రెండ్లీ) మారుస్తున్నాయి. అమెజాన్ Amazon, గూగుల్Google, మరియు జాపోస్ వంటి ప్రఖ్యాత సంస్థలు చాలా కాలంగా తమ కార్యాలయాల్లోకి పెంపుడు జంతువులను అనుమ‌తిస్తున్న విష‌యం తెలిసిందే. జంతువులతో సాన్నిహిత్యంగా ఉండ‌డం వ‌ల‌న‌ ఒత్తిడిని తగ్గడం జ‌రుగుతుంది. ఇది సాంఘిక సంబంధాలను ప్రోత్సహించి, ఉత్పాదకతను పెంచుతుందని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...