అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | భార్య కాపురానికి రావడం లేదని భర్త సెల్‌టవర్ ఎక్కాడు. ఈ ఘటన ఎల్లారెడ్డి పట్టణంలో (Yellareddy Town) శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా నివాసముండే పవన్‌కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే గొడవల కారణంగా ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.
ఆర్నెళ్లుగా భార్య కాపురానికి రాకపోవడంతో మనస్థాపం చెందిన పవన్ పట్టణంలోని సెల్‌టవర్ (cell tower) ఎక్కాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పవన్‌ను బుజ్జగించి సెల్‌టవర్ పైనుంచి కిందికి దింపారు.
