ePaper
More
    Homeటెక్నాలజీHyundai venue | హ్యుందాయ్‌ వెన్యూ కారుపై డిస్కౌంట్.. ఈ ఆఫ‌ర్ తెలిస్తే వెంటనే కొనేస్తారు..!

    Hyundai venue | హ్యుందాయ్‌ వెన్యూ కారుపై డిస్కౌంట్.. ఈ ఆఫ‌ర్ తెలిస్తే వెంటనే కొనేస్తారు..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hyundai venue | ఈ రోజుల్లో ప్ర‌తి ఒక్క‌రు కారు కొనాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. ఎవ‌రికి వారు తమ సొంత కార్ల‌లో వెళ్లేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.

    ఈ క్ర‌మంలో కంపెనీలు కొత్త కొత్త మోడ‌ల్ కార్స్‌ని మార్కెట్‌లోకి (new model cars on market) తీసుకువ‌స్తున్నాయి. అంతేకాదు కొత్త కొత్త మోడ‌ల్స్ ప‌రిచ‌యం చేస్తూ వాటిపై భారీ డిస్కౌంట్స్ (huge discount on new model cars) కూడా ఇస్తున్నాయి. ఇప్పుడు ఎవ‌రైనా కొత్త కార్ కొనాల‌ని అనుకుంటే వారికి కు ‘హ్యుందాయ్‌ మోటార్‌’ (hyundai motors) గుడ్‌ న్యూస్‌ చెప్పింది. తన ప్రసిద్ధ SUV ‘వెన్యూ’పై భారీ డిస్కౌంట్‌ ప్రకటించింది.

    Hyundai venue | ఆల‌స్యం చేయ‌కండి..

    మే నెలను హ్యుందాయ్ వెన్యూ Hyundai venue కొనడానికి ఒక గొప్ప అవకాశంగా చూడొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో, ఈ నెలలో హ్యుందాయ్ వెన్యూ కొంటే రూ.75,000 వరకు తగ్గింపు ద‌క్క‌నుంది. ఈ ఆఫర్ క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ & కార్పొరేట్ ఆఫర్ రూపంలో లభిస్తుంది. ఈ డిస్కౌంట్‌ MY24 స్టాక్‌కు మాత్రమే వర్తిస్తుంది.

    హ్యుందాయ్ కంపెనీ, వెన్యూ SUVని మొత్తం 7 వేరియంట్లలో లాంచ్‌ చేసింది, అవి – E, E+, Executive, S, S+/S(O), SX & SX(O). దీని ఎక్స్-షోరూమ్‌ ధర వేరియంట్‌ను బట్టి రూ.7.94 లక్షల నుంచి ప్రారంభమై రూ.13.53 లక్షల వరకు ఉంటుంది. మూడు ఇంజిన్‌ ఆప్షన్లలో హ్యుందాయ్ వెన్యూ పవర్‌ పొందుతుంది. 1.2L నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ (petrol engine), 1.0L టర్బోచార్జ్‌డ్‌ పెట్రోల్ ఇంజిన్ & 1.5L డీజిల్ ఇంజన్ (turbocharged petrol engine and diesel engine). కంపెనీ ప్రకారం, వెన్యూ గరిష్ట మైలేజ్ లీటరుకు 23 కిలోమీటర్లు.

    హ్యుందాయ్ వెన్యూ ఫీచర్లు ఈ ఫోర్‌వీలర్‌ను ప్రీమియం SUV అని ఫీల్‌ అయ్యేలా చేస్తాయి. 8-అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (touchscreen infotainment system), ఆపిల్ కార్‌ప్లే & ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ (wireless phone charging), క్రూయిజ్ కంట్రోల్, సన్‌రూఫ్, ఎయిర్ ప్యూరిఫైయర్, యాంబియంట్ లైటింగ్ & ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్‌ వంటి ప్రీమియం కార్‌ ఫీచర్లను ఇందులో చూడవచ్చు. భద్రత పరంగా, హ్యుందాయ్ వెన్యూలో 6 ఎయిర్‌ బ్యాగులు, EBDతో కూడిన ABS, రియర్‌ పార్కింగ్ సెన్సార్లు, రివర్స్ కెమెరా & ట్రాక్షన్ కంట్రోల్ వంటివి అమర్చారు. దీని టాప్ వేరియంట్లలో లెవల్-1 ADAS సిస్టమ్ కూడా ఉంది, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్ & హై బీమ్ అసిస్ట్ (driver Attention Warning & High Beam Assist) వంటి ఆధునిక భద్రత సాంకేతికతలను దీనిలో అమర్చారు.

    More like this

    Local Body Elections | స్థానిక ఎన్నికలపై కీలక అప్​డేట్​.. రిజర్వేషన్ల పెంపునకు గవర్నర్​ ఆమోదం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Local Body Elections | స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్​డేట్​ వచ్చింది. బీసీ...

    Sriram Sagar | శ్రీరాంసాగర్ వరద గేట్ల మూసివేత

    అక్షరటుడే, బాల్కొండ: Sriram Sagar | తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి (Sriram Sagar Project) వరద తగ్గుముఖం...

    Yellareddy | చెరువు బాగు కోసం రైతులంతా ఏకమయ్యారు..

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా గ్రామస్థులు తమ చెరువును...