అక్షరటుడే, వెబ్డెస్క్: Pakistan | పాకిస్తాన్లో భారీ బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. పాకిస్థాన్‌లోని క్వెట్టా ప్రాంతంలోని ఫ్రాంటియర్ కోర్ కేంద్ర కార్యాలయం సమీపంలో ఈ ఘటన చేసుకుంది.
బలూచిస్థాన్(Balochistan)లోని క్వెట్టా నగరంలో పారామిలిటరీ బలగాలకు చెందిన ఫ్రాంటియర్ కోర్ కార్యాలయం సమీపంలో పేలుళ్లు జరగడం గమనార్హం. పేలుడు ధాటికి చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఇళ్లు, భవనాల కిటికీ అద్దాలు పగిలిపోయాయి. అనంతరం వెంటనే కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నిందితుల కోసం బలగాలు గాలిస్తున్నాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రులకు తరలించారు.
Pakistan | కారు బాంబుతో..
పేలుడు పదార్థాలతో నిండిన కారు ఫ్రాంటియర్ కోర్ (Frontier Core) సమీపంలో మలుపు తీసుకుంటుండగా.. పేలుడు సంభవించిందని క్వెట్టా ప్రత్యేక కార్యకలాపాల SSP ముహమ్మద్ బలోచ్ తెలిపారు. ఈ ఘటనలో 13 మంది మరణించగా, 32 మంది గాయపడ్డారు. పేలుడు చాలా శక్తివంతంగా ఉండడంతో మోడల్ టౌన్, పరిసర ప్రాంతాల వరకు శబ్ధం వినిపించింది. ఆ వెంటనే ఆ ప్రాంతంలో కాల్పుల శబ్దం కూడా వినిపించింది. రెస్క్యూ బృందాలు, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. బలూచిస్తాన్లో ఆందోళన చేస్తున్న ప్రజలపై ఇటీవల పాక్ సైన్యం (Pakistan Army) కాల్పులు జరిపింది. ఎక్కడిక్కడ నిరసనలను అణచివేయడానికి భారీగా బలగాలను మోహరించింది. ఈ క్రమంలో తాజాగా పేలుడు చోటు చేసుకోవడం గమనార్హం. ఇప్పటి వరకు ఏ సంస్థ కూడా దీనిని బాధ్యత తీసుకోలేదు.