ePaper
More
    Homeటెక్నాలజీBaby podcast Video | బేబి పాడ్‌కాస్ట్ వీడియో ఎలా చేయాలో మీకు తెలుసా?

    Baby podcast Video | బేబి పాడ్‌కాస్ట్ వీడియో ఎలా చేయాలో మీకు తెలుసా?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Baby podcast Video | ప్ర‌స్తుతం ప్రపంచం World మ‌న అర‌చేతిలో ఉంది. ఏ విష‌యాన్నైన సాంకేతిక‌ని ఉప‌యోగించి ఫోన్‌లో సెర్చ్ చేసుకోవ‌చ్చు. ఏఐ.. ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) అనేది ఇప్పుడు ప్రపంచమంతా చర్చనీయాంశంగా మారింది. దానికి ముఖ్య కారణం చాట్ జీపీటీ. చాట్ జీపీటీ కారణంగా చాలా పనులు సులువుగా మారిపోతున్నాయి. మన ప్రస్తుతం జీవన విధానంలో చాట్ జీపీటీనీ (Chat GPT) రోజువారి పనుల్లో చాలా ఉప‌యోగంగా మారింది. ఏదైనా సమాచారం కావాలంటే మొన్నటి వరకు గూగుల్‌లో (google) వెతికే వారు. కానీ ప్రస్తుతం చాట్‌ జీపీటీని ఆశ్రయిస్తున్నారు. ఒక ప్రశ్నకు గూగుల్‌ వంద రకాల సమాధానాలు చెప్తుంది. అయితే చాట్‌ జీపీటీ మాత్రం మీ ప్రశ్నకు సరైన ఒకే ఒక సమాధానం ఇస్తుండ‌డంతో దీని ఉప‌యోగం పెరిగింది.

    Baby podcast Video | మీరు ట్రై చేయండి..

    ఈ క్ర‌మంలో చాట్ జీపీటీకి (Chat GPT) ప్రపంచవ్యాప్తంగా భారీగా ఆదరణ లభించింది. ఒక మనిషితో మనం చాట్‌ చేస్తే ఎలా ఉంటుందో అచ్చంగా అలాగే ఉంటుంది చాట్‌ జీపీటీతో Chat Gpt. ఈమెయిల్స్ డ్రాఫ్టింగ్ దగ్గర నుంచి ఇటీవల వచ్చిన గిబ్లీ స్టైల్ ఇమేజ్ (Gibli Style Image) వరకూ చాట్ జీపీటీ ఎన్నో అద్భుతాలు ఆవిష్కరిస్తోంది. ఫోటోలను యానిమేషన్ (Animation) శైలిలో మార్చుకోవాలని ఆశించే వారందరికీ కూడా ఒక అద్భుతమైన మార్గం చూపించింది చాట్ జీపీటీ. అలానే ఈ మ‌ధ్య బేబి పాడ్ కాస్ట్ వీడియోలు (Baby Podcast Videos) కూడా తెగ ట్రెండ్ అవుతున్నాయి. పిల్ల‌లు పాట పాడుతున్న‌ట్టు ప‌లు వీడియోలు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. వాటిని చాట్ జీపీటీలో ఎలా చేయాలో చూడండి.

    ముందుగా చాట్ జీపీటీ ఓపెన్ చేసి అందులో మీ ఫొటోని అప్‌లోడ్ చేయండి. ట‌ర్న్ దిస్ ప‌ర్స‌న్ ఇన్‌టూ బేబి ఇన్ పాడ్‌కాస్ట్ స్టూడియో అని టైమ్ చేసి ఎంట‌ర్ చేయండి. కొద్ది సెకన్స్ లో ఏఐ క్రియేటెడ్ బేబి ఫొటో క‌నిపిస్తుంది. దానిని డౌన్‌లోడ్ చేసుకోండి. త‌ర్వాత గూగుల్‌లో హెడ్రా. కామ్ Hedra.com అని సెర్చ్ చేసి వీడియో ఆప్ష‌న్ సెల‌క్ట్ చేసుకోండి. ఇక్క‌డ ఏఐ జ‌నరేటెడ్ ఫొటోని (AI Generated Photo) అప్‌లోడ్ చేయండి. ఆ త‌ర్వాత ఆడియో ఆప్ష‌న్ పైన క్లిక్ చేసి మీకు కావ‌ల‌సిన ఆడియోని (Audio) సెలక్ట్ చేసుకోండి. ఆ త‌ర్వాత జ‌న‌రేట్ ది వీడియో దానిపైన క్లిక్ చేస్తే మీకు కావ‌ల‌సిన బేబి పాడ్ కాస్ట్ వీడియో (Baby Podcast Video) రెడీ అవుతుంది.

    More like this

    September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగంతేదీ (DATE) – సెప్టెంబరు 11,​ 2025 పంచాంగంశ్రీ విశ్వావసు...

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...