54
అక్షరటుడే, బోధన్ : Renjal Mandal | రెంజల్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. భార్యను భర్త పారతో కొట్టి హత్య చేశాడు. రెంజల్ ఎస్సై చంద్రమోహన్ (SI Chandramohan) వివరాలు వెల్లడించారు.
Renjal Mandal | ఆవేశంలో పారతో దాడి..
మండలంలోని బోర్గాం గ్రామం (Borgam Village)లో మల్లుగారి బస్వారెడ్డి, రుక్మిణి భార్యభర్తలు. అయితే కొన్నినెలలుగా వీరి పొలం పనుల విషయంలో తగాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం సైతం గొడవ జరగగా.. ఆవేశంలో బస్వారెడ్డి రుక్మిణిపై పారతో దాడిచేశాడు. ఈ క్రమంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం బస్వారెడ్డిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చంద్రమోహన్ తెలిపారు.