RTC-Staff
RTC Staff | నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ సిబ్బంది

అక్షరటుడే, బాన్సువాడ: RTC Staff | బాన్సువాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రయాణికుడు(Passenger) మంగళవారం రాత్రి బస్సులో తన బ్యాగ్​ మరిచిపోయాడు. అందులో రూ.50 వేల నగదు ఉంది. బస్సు దిగాక గమనించిన ప్రయాణికుడు బాన్సువాడ డిపో మేనేజర్ సరితా దేవి(Banswada Depot Manager)కి ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో ఆమె వెంటనే స్పందించి కండక్టర్ భీమా, డ్రైవర్ రామకృష్ణకు ఫోన్ చేశారు. బస్సులో గాలించగా బ్యాగు దొరికింది. ఎంజీబీఎస్(MGBS)లో ప్రయాణికుడికి ఫోన్ చేసి డ్రైవర్, కండక్టర్ బ్యాగ్​ను అప్పగించారు. కండక్టర్, డ్రైవర్​ను డిపో మేనేజర్ సరిత దేవి బుధవారం సన్మానించారు.