అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad Police | మద్యం మత్తులో ముగ్గురు యువకులు హోంగార్డు (Home Guard)పై దాడిచేశారు. ఈ ఘటన మంగళవారం రాత్రి నగరంలో చోటు చేసుకుంది. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ (Traffic Inspector Prasad) తెలిపిన వివరాల ప్రకారం..నగరంలోని 1వ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నిఖిల్‌సాయి (Hotel Nikhil Sai) చౌరస్తా సమీపంలో మంగళవారం రాత్రి వాహనాలు తనిఖీ చేస్తూ.. ముగ్గురు వ్యక్తులు వెళ్తున్న ఓ కారును ఆపారు.
Nizamabad Police | తనిఖీలు చేస్తుండగా దాడి..
అనంతరం వారిని హోంగార్డు గంగామోహన్తో కూడిన బృందం తనిఖీలు చేస్తుండగా వారు ఆయనపై దాడికి తెగబడ్డారు. దీంతో స్పందించిన పోలీసులు ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుని వన్ టౌన్‌కు తీసుకెళ్లారు. అనంతరం హోంగార్డు గంగామోహన్ ఫిర్యాదు మేరకు 1వ టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి (1 Town SHO Raghupathi) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Nizamabad Police | కారులో గంజాయి లభ్యం..
అయితే మద్యం మత్తులో ఉన్న ముగ్గురు ప్రయాణిస్తున్న కారును తనిఖీ చేయగా అందులో మద్యం బాటిళ్లు.. గంజాయి లభ్యమైంది. దీంతో పోలీసులు గంజాయిని ఎక్కడ తీసుకున్నారు. దీని వెనక ఉన్న వారిపై గురించి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.