Mla Venkata Ramana Reddy
Mla Venkata Ramana Reddy | మోదీ హయాంలో చారిత్రాత్మక నిర్ణయాలు

అక్షరటుడే, కామారెడ్డి: Mla Venkata Ramana Reddy | ప్రధాని మోదీ (PM Modi) పాలనలో చరిత్రలో నిలిచే సంక్షేమ పథకాలు అమలు చేశారని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. శనివారం పార్టీ జిల్లా కార్యాలయంలో 11ఏళ్ల పాలనపై ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని పరిశీలించారు. అనంతరం ఇందుకు సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించి మాట్లాడారు.

ప్రధాని మోదీ దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిపారన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు విపుల్‌ జైన్, రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.