అక్షరటుడే, ఇందూరు: RSS Nizamabad | భారతదేశంలో పుట్టిన వారందరూ హిందువులేనని ఎన్నటికీ తమ మూలాలను మర్చిపోవద్దని ఆర్ఎస్ఎస్ ఇందూర్ (RSS Indur) విభాగం ప్రచార ప్రముఖ డాక్టర్ వారే దస్తగిరి తెలిపారు. ఆర్ఎస్ఎస్ కంఠేశ్వర్ ఉపనగర ఆధ్వర్యంలో సంక్రాంతి ఉత్సవాలు నిర్వహించారు.
RSS Nizamabad | హిందూధర్మంలో అసమానతల్లేవు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందూ ధర్మంలో అసమానతలు లేవని.. సమస్త ప్రాణకోటికి భగవంతుడు తన పిల్లలుగా భావిస్తాడన్నారు. కాలక్రమేనా సమాజంలో కొన్ని దుష్టశక్తులు చొరబడ్డాయని అందువల్లే అంటరానితనం వంటి దుర్మార్గపు ఆలోచనలు హిందూ సమాజాన్ని (Hindu society) విచ్ఛిన్నం చేశాయన్నారు. ప్రతి హిందువును స్వయంసేవక్‌గా మల్చడానికి అందరూ కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కార్యక్రమంలో విశ్రాంతర ప్రధానోపాధ్యాయుడు లింబాద్రి, ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలకు డాక్టర్ కాపర్తి గురు చరణం, ఉపనగర కార్యవాహ ప్రవీణ్, రామ్ లక్ష్మణ్, శ్రావణ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.