అక్షరటుడే, వెబ్‌డెస్క్: High-Protein | సాధారణంగా ప్రొటీన్ లేదా మాంసకృత్తులు అంటే మనకు వెంటనే గుర్తొచ్చేవి గుడ్లు, చికెన్ లేదా మటన్. మాంసాహారం తినే వారికి ఇవి సులభంగా అందుతాయి కానీ, శాకాహారుల విషయంలో “మాంసకృత్తులు ఎలా లభిస్తాయి?” అనేది ఒక పెద్ద ప్రశ్న. అయితే, మన వంటగది kitchens లోనే మాంసాహారానికి దీటుగా శక్తినిచ్చే అద్భుతమైన ఆహార పదార్థాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళల విషయంలో ప్రొటీన్ పాత్ర చాలా కీలకం. ఎముకల పుష్టి, రోగనిరోధక శక్తి పెరగడం, గర్భధారణ సమయంలో శిశువు ఎదుగుదల, రుతుక్రమ సమస్యలు దరిచేరకూడదంటే శరీరానికి తగినంత ప్రొటీన్ అందాల్సిందే.
High-Protein | ఎవరికి ఎంత అవసరం?
భారతీయ వైద్య పరిశోధనా మండలి ian Council of Medical Research (ICMR-NIN) గణాంకాల ప్రకారం.. 19 నుంచి 50 ఏళ్ల వయసున్న సాధారణ మహిళలకు ప్రతిరోజు 46 – 50 గ్రాముల ప్రొటీన్ అవసరం. అదే ఒకవేళ జిమ్, కఠినమైన వ్యాయామాలు చేసే మహిళలైతే, వారి శరీర బరువును బట్టి రోజుకు 66 – 110 గ్రాముల వరకు ప్రొటీన్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దురదృష్టవశాత్తు.. చాలామంది మహిళలు తమ రోజువారీ ఆహారంలో తగినంత ప్రొటీన్ తీసుకోవడం లేదని సర్వేలు చెబుతున్నాయి.
శాకాహార ప్రొటీన్ నిధులు
మాంసాహారం ముట్టని వారు తమ రోజువారీ భోజనంలో ఈ క్రింది పదార్థాలను చేర్చుకోవడం ద్వారా ప్రొటీన్ లోపాన్ని అధిగమించవచ్చు.
పప్పు ధాన్యాలు, పాలు: మన ఇంట్లో నిత్యం వాడే పెసరపప్పు, శెనగలు, మినప్పప్పులలో ప్రొటీన్ సమృద్ధిగా ఉంటుంది. అలాగే పాలు milk, పెరుగు (Curd) yogurt, పనీర్ paneer వంటి పాల ఉత్పత్తులు శాకాహారులకు అత్యుత్తమ ప్రొటీన్ మూలాలు.
సోయాబీన్స్: ఒక రోజుకు శరీరానికి కావాల్సిన మాంసకృత్తులలో సుమారు 72 శాతం కేవలం సోయాబీన్స్ ద్వారానే పొందవచ్చు. ఇందుకోసం రోజుకు కనీసం 30 గ్రాముల సోయాను ఏదో ఒక రూపంలో తీసుకోవాలి.
గింజలు, నట్స్: అవిసె గింజలు, నువ్వులు, గుమ్మడి గింజలలో ఏదో ఒక రకాన్ని రోజూ ఒక పెద్ద స్పూన్ తీసుకుంటే, శరీరానికి కావాల్సిన ప్రొటీన్ లో 30 శాతం అందుతుంది. అలాగే డ్రై ఫ్రూట్స్ లో బాదం అత్యంత శక్తివంతమైనది. రోజుకు 10 నానబెట్టిన బాదం గింజలు తింటే చాలు.
మొక్కజొన్న, వేరుశెనగ: మొక్కజొన్నలో కూడా మాంసకృత్తులు అధికంగా ఉంటాయి. అర కప్పు మొక్కజొన్న గింజలు, ఒక సగం పొత్తు తిన్నా శరీరానికి మంచి శక్తి లభిస్తుంది. అలాగే వేరుశెనగ చట్నీ, పీనట్ బటర్ కూడా ప్రొటీన్ పెంచడానికి చక్కగా ఉపయోగపడతాయి.