అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IAS Amrapali | ఐఏఎస్ అధికారి ఆమ్రపాలికి హైకోర్టులో షాక్ తగిలింది. ఆమెను తెలంగాణకు కేటాయిస్తూ CAT ఇచ్చిన ఉత్తర్వులపై కోర్టు స్టే విధించింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆమ్రపాలిని ఆదేశించింది.
ఆమ్రపాలి 2009 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆమె గతంలో తెలంగాణ (Telangana)లో కీలక పదవుల్లో పని చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించింది. అయితే ఆమ్రపాలిని ఏపీకి కేటాయిస్తూ డీవోపీటీ గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా ఆమె ఏపీలో విధుల్లో చేరారు. అనంతరం సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ (Central Administrative Tribunal)ను ఆశ్రయించారు. IAS హరికిరణ్‌తో మ్యూచ్‌వల్ ట్రాన్స్ఫర్ ద్వారా IAS అమ్రపాలిని తెలంగాణకు కేటాయించాలని క్యాట్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇటీవల ఆమె రాష్ట్రంలో విధుల్లో చేరారు. తాజాగా హైకోర్టులో ఆమెకు ఎదురుదెబ్బ తగిలింది.
IAS Amrapali | డీవోపీటీ సవాల్
క్యాట్ తీర్పుపై డీవోపీటీ హైకోర్టు (High Court)లో సవాల్ చేసింది. దీంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం విచారణ చేపట్టింది. డీవోపీటీ వాదనలు వినిపిస్తూ.. మార్పిడి ఆమెకు వర్తించదు అని వాదించింది. హరికిరణ్ రిజర్వ్డ్ కేటగిరీకి చెందినవారని, కాబట్టి మార్పిడి చెల్లదని పేర్కొంది. దీంతో క్యాట్ ఆదేశాలపై హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆమ్రపాలని ఆదేశించింది. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేసింది.