High Court | ప్రభుత్వానికి హైకోర్టు షాక్​.. రూ.350 కోట్ల భూ కేటాయింపులు రద్దు

అక్షరటుడే, వెబ్​డెస్క్: High Court | రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. హైదరాబాద్ (Hyderabad)​లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ సెంటర్‌ (IAMC) ఏర్పాటు కోసం గతంలో ప్రభుత్వం స్థలం కేటాయించింది. ఈ కేటాయింపులను రద్దు చేస్తూ శుక్రవారం ధర్మాసనం తీర్పు చెప్పింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు కొట్టివేసింది. శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం (Rayadurgam)లోని 83/1లో సర్వే నంబర్​లో 3.5 ఎకరాల భూమిని ఐఏఎంసీకి కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: High Court | రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. హైదరాబాద్ (Hyderabad)​లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ సెంటర్‌ (IAMC) ఏర్పాటు కోసం గతంలో ప్రభుత్వం స్థలం కేటాయించింది. ఈ కేటాయింపులను రద్దు చేస్తూ శుక్రవారం ధర్మాసనం తీర్పు చెప్పింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు కొట్టివేసింది.

శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం (Rayadurgam)లోని 83/1లో సర్వే నంబర్​లో 3.5 ఎకరాల భూమిని ఐఏఎంసీకి కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో జీవో జారీ చేసింది. ఐటీ కారిడార్​ (IT Corridor) ప్రాంతంలో ఉన్న సదరు భూమి విలువ రూ.350 కోట్ల వరకు ఉంటుంది. అంతేగాకుండా సదరు సంస్థకు ఏడాదికి రూ.3 కోట్లు కేటాయిస్తూ జీవో జారీ చేసింది.

అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ సెంటర్‌ అనేది ఒక ప్రైవేట్​ సంస్థ అని.. దానికి ప్రభుత్వ భూమి, నిధులు ఎలా కేటాయిస్తారని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. న్యాయవాదులు రఘునాథ్‌రావు, వెంకటరామ్‌రెడ్డి వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై న్యాయమూర్తులు లక్ష్మణ్, సుజనలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్లపై వాదనలు జనవరిలోనే ముగిశాయి. అప్పుడు తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు తాజాగా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టింది. భూమి కేటాయింపుతో పాటు, దాని ప్రస్తుత భవన నిర్వహణ కోసం జారీ చేసిన జోవోలను కొట్టి వేసింది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...