అక్షరటుడే, వెబ్డెస్క్: Pending Challans | వాహనాలకు సంబంధించిన పెండింగ్ చలాన్ల (Pending Challans) విషయంలో తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. చలాన్ల వసూలుకు వాహనదారులను బలవంతపెట్టవద్దని ట్రాఫిక్ పోలీసులను (traffic police) ఆదేశించింది.
చలాన్లు చెల్లించాలని బైక్ కీస్ లాక్కోవడం.. వాహనాన్ని ఆపేయడం లాంటివి చేయకూడదని పేర్కొన్నారు. వాహనాలు ఆపిన సమయంలో వాహనదారులు స్వచ్ఛందంగా చలాన్లు చెల్లిస్తే.. పోలీసులు వసూలు చేసుకోవచ్చని తెలిపిలింది. అయితే వాహనదారులు చెల్లించడానికి ఇష్టపడకపోతే మాత్రం చట్టప్రకారం కోర్టు నోటీసులివ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
Pending Challans | బలవంతపు వసూళ్లపై పిటిషన్
ట్రాఫిక్ చలాన్లను (traffic challans) పోలీసులు బలవంతంగా వసూలు చేస్తున్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై న్యాయవాది విజయ్ గోపాల్ (Advocate Vijay Gopal) వాదనలు వినిపించారు. చలాన్ల వసూలుకు పోలీసులు వాహనదారులను ఇబ్బంది పెడుతున్నారని వివరించారు. దీనిపై స్పందించి న్యాయస్థానం ట్రాఫిక్ పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.