Temperatures | ఆ ఏడు జిల్లాలకు ఆరెంజ్​ అలర్ట్.. అంతకు మించి నమోదు కానున్న ఉష్ణోగ్రతలు
Temperatures | ఆ ఏడు జిల్లాలకు ఆరెంజ్​ అలర్ట్.. అంతకు మించి నమోదు కానున్న ఉష్ణోగ్రతలు

అక్షరటుడే, హైదరాబాద్: Heatwaves : తెలంగాణపై భానుడి ప్రతాపం కొనసాగుతోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. నేడు రాష్ట్రంపై వడగాలుల ప్రభావం ఉండబోతుందని వాతావరణ శాఖ ప్రకటించింది.

ఇప్పటికే ఆదిలాబాద్‌, కుమురం భీం, నిజామాబాద్‌, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలకు రెడ్‌ అలర్ట్ ప్రకటించింది.

మరో 21 జిల్లాలు ఆరెంజ్‌ అలర్ట్‌ పరిధిలో ఉన్నాయి. వడగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని కోరింది.

ఇక గరిష్ఠ ఉష్ణోగ్రతల విషయానికి వస్తే.. గురువారం నిజామాబాద్​, నిర్మల్​ జిల్లాల్లో 45.4 డిగ్రీలు నమోదయ్యాయి. జగిత్యాల, మంచిర్యాల, కొమురంభీమ్​, ఆదిలాబాద్ జిల్లాల్లో 45 డిగ్రీలపై ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.