అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Actress Hema | తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో లేడీ కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి హేమ (Actress Hema) కుటుంబంలో విషాదం నెలకొంది.
హేమ తల్లి కోళ్ల లక్ష్మి (80) సోమవారం రాత్రి (నవంబర్ 17) కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సమస్యలు సహా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె పరిస్థితి ఒక్కసారిగా క్షీణించడంతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తల్లి మరణవార్త తెలియగానే హేమ వెంటనే తన స్వగ్రామం రాజోలు చేరుకుంది. తల్లి పార్థీవ దేహాన్ని చూసి హేమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అంత్యక్రియలు మంగళవారం రాజోలులోని ఇంటి వద్దే నిర్వహించారు.
Actress Hema | హేమ తల్లి మృతి
హేమ సోదరుడు కోళ్ల శ్రీనివాస్ వద్ద లక్ష్మి (Lakshmi) నివసిస్తున్నారు. అంత్యక్రియలకు స్థానికులు, బంధువులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గతంలో రేవ్ పార్టీ ఘటనలో డ్రగ్స్ ఆరోపణలతో హేమ అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన సందర్భం అందరికీ తెలిసిందే. ఆ సమయంలో ఓ ఇంటర్వ్యూలో హేమ మాట్లాడుతూ.. “నేను జైలుకెళ్లడం చూసి మా అమ్మ చాలా బాధపడింది, షాక్ అనారోగ్యం పాలైంది” అని చెప్పారు. ఇటీవల సినిమాలకు దూరంగా ఉన్న హేమ మళ్లీ తల్లిని కోల్పోవడంతో మనస్తాపానికి గురయ్యారు. తల్లి మరణంతో హేమ పలు పాత ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో (Instagram story) షేర్ చేయగా.. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినీ ప్రముఖులు, నెటిజన్లు హేమకు సంతాపం తెలియజేస్తూ లక్ష్మికి నివాళులర్పిస్తున్నారు.
అప్పుడెప్పుడో శ్రీదేవి, వెంకటేష్‌ల ‘క్షణ క్షణం’ నుంచి మొన్నటి వరకూ సినిమాలు చేస్తూ తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించిన నటి హేమ. లేడీ కమెడియన్‌గా (lady comedian), క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇప్పటివరకు 250కు పైగా చిత్రాల్లో మెరిసి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించింది. అయితే సినీ కెరీర్‌తో పాటు వివాదాలు కూడా హేమను తరచూ చుట్టుముట్టాయి. ముఖ్యంగా MAA ఎన్నికల సమయంలో ఆమె చేసిన ప్రెస్ మీట్స్, వివాదాస్పద వ్యాఖ్యలు, తోటి నటీనటులపై చేసిన ఆరోపణలు పెద్ద సెన్సేషన్ అయ్యాయి. అదే సమయంలో, గతేడాది సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ కేసు హేమ ఇమేజ్‌పై గణనీయమైన ప్రభావం చూపిందని చెప్పాలి. ఆ పార్టీలో హేమ పాల్గొనిందనే వార్తలు, డ్రగ్స్ తీసుకుందనే ఆరోపణలు పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి.
