Homeజిల్లాలునిజామాబాద్​Dichpally | ‘హెల్ప్​ టు అదర్స్’​ ఆధ్వర్యంలో విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ

Dichpally | ‘హెల్ప్​ టు అదర్స్’​ ఆధ్వర్యంలో విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ

అమెరికాకు చెందిన ‘హెల్ప్ టు అదర్స్’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి నర్సయ్య పాల్గొన్నారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Dichpally | అమెరికాకు చెందిన ‘హెల్ప్ టు అదర్స్’ (Help to Others) స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గురువారం బీసీ సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. డిచ్‌పల్లి గ్రామంలోని ప్రభుత్వ బీసీ సంక్షేమ వసతి గృహంలో (BC Welfare Hostel) విద్యార్థినులకు అందజేశారు.

కార్యక్రమానికి జిల్లా బీసీ అభివృద్ధి అధికారి నర్సయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థినులను చలి నుంచి కాపాడేందుకు హెల్ప్ టు అదర్స్ సంస్థ రగ్గులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. విద్యార్థినులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. చిన్నప్పటి నుంచి సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు.

హెల్ఫ్ టు‌ అదర్స్ తెలంగాణ కో–ఆర్డినేటర్ జిల్కర్ విజయానంద్ మాట్లాడుతూ చలికాలాన్ని దృష్టిలో ఉంచుకొని అమెరికాలో నివాసముంటున్న హెల్ఫ్ టు అదర్స్ సంస్థ వ్యవస్థాపకురాలు శ్రీలత కొరడా రగ్గులు సమకూర్చారని చెప్పారు. డిచ్‌పల్లి ప్రభుత్వ బీసీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ దివ్య, ఇండియన్ రెడ్​క్రాస్ సొసైటీ జిల్లా ఛైర్మన్​ బుస్సా ఆంజనేయులు, జిల్లా కో- ఆర్డినేటర్ చింతల గంగాదాస్, రెడ్​క్రాస్ పీఆర్వో రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.