అక్షరటుడే, వెబ్డెస్క్: Heavy Rains | రాష్ట్రంలోని పలు జిల్లాలు భారీ వర్షాలు (heavy rains) ముంచెత్తుతున్నాయి. కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, నిర్మల్ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా రైళ్ల రాకపోకలకు సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మండలం తలమడ్ల రైల్వే ట్రాక్ (Talamadla railway track) కింద నుంచి వరద ఉధృతితో ట్రాక్ దెబ్బతింది. దీంతో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. రైళ్లను మహారాష్ట్ర కాచిగూడ, కాజీపేట వెళ్లే రైళ్లను నిజామాబాద్, పెద్దపల్లి (Nizamabad and Peddapalli) మీదుగా మళ్లించారు.
Heavy Rains | పలు రైళ్లు రద్దు
మనోహరాబాద్ నుంచి సిద్దిపేట (Manoharabad to Siddipet) సెక్షన్‌లోని గజ్వేల్ నుంచి లక్డారం రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే పట్టాలపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఈ మార్గంలో నడిచే పుష్ పుల్ డెమో రైళ్లను దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు నేడు రద్దు చేశారు.
1. రైలు నంబర్ 77653/54 మల్కాజిగిరి – సిద్దిపేట – మల్కాజిగిరి డెమో ప్యాసింజర్ నేడు రద్దు చేశారు.
2. రైలు నంబర్ 77655/56 మల్కాజిగిరి – సిద్దిపేట – మల్కాజిగిరి డెమో ప్యాసింజర్ నేడు రద్దయ్యింది.
అలాగే బుధవారం రాత్రి 11:50 నిమిషాలకు బయలుదేరాల్సిన కాచిగూడ నుంచి భగత్ కి కోటి (జోధ్ పూర్ ) 17605 ఎక్స్ ప్రెస్ రైలు ఆలస్యంగా నడుస్తోంది. 9 గంటలు ఆలస్యంగా గురువారం ఉదయం 8:50 నిమిషాలకు కాచిగూడ నుంచి బయలుదేరింది. ఈ రైలు వాస్తవానికి కామారెడ్డి – నిజామాబాద్ మార్గంలో (Kamareddy – Nizamabad route) నడుస్తుంది. కానీ కామారెడ్డి దగ్గర పట్టాలు వరద నీటి ప్రవాహంలో కొట్టకుపోవడంతో నేడు ఈ రైలును వయా మల్కాజ్ గిరి – కాజీపేట – పెద్దపల్లి బైపాస్ – నిజామాబాద్ మీదుగా దారి మళ్లించి నడుపుతున్నారు.