అక్షరటుడే, మెండోరా : Sriram Sagar | ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ (Sriram Sagar Project)కి ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది. దీంతో అధికారులు 40 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
Sriram Sagar | 40 గేట్లు ఎత్తి.. దిగువకు..
రాష్ట్రంలో.. ఎగువన ఉన్న మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో గోదావరి (Godavari)కి భారీగా వరదనీరు పోటెత్తుతోంది. దీంతో ఎస్సారెస్పీలోకి 2,15,894 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. అధికారులు దిగువకు నీటి విడుదలను భారీగా పెంచారు. 40 గేట్లు ఎత్తి 3,51,017 క్యూసెక్కులు వదులుతున్నారు.
Sriram Sagar |కాలువల ద్వారా నీటి విడుదల
ప్రాజెక్ట్ ఎస్కేప్ గేట్ల ద్వారా 2,500 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. వరద కాలువకు 6,214, కాకతీయ కాలువకు 5,500 వేలు, సరస్వతి కాలువకు 400, లక్ష్మి కాలువకు 100 క్యూసెక్కులు అలీసాగర్ (Ali Sagar) 180 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మిషన్ భగీరథకు 231క్యూసెక్కులు, ఆవిరిరూపంలో 632 క్యూసెక్కుల నీరు పోతోంది.
Sriram Sagar | క్రమంగా తగ్గుతున్న నీటిమట్టం
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద పోటెత్తడంతో అధికారులు నీటి విడుదలను భారీగా పెంచారు. ఇన్‌ఫ్లో కంటే అవుట్‌ఫ్లో (outflow) అధికంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో జలాశయం నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం జలాశయంలోకి 2.15,894 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 3,51,017క్యూసెక్కుల అవుట్‌ఫ్లో ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 (80.5 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 1085.40 (61.175 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది. గోదావరిలోకి భారీగా నీటిని వదులుతుండటంతో పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.