ePaper
More
    Homeజిల్లాలుమెదక్​Revanth visits flooded areas | వీడని కుంభవృష్టి.. ముంపు ప్రాంతాలకు సీఎం రేవంత్​..!

    Revanth visits flooded areas | వీడని కుంభవృష్టి.. ముంపు ప్రాంతాలకు సీఎం రేవంత్​..!

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth visits flooded areas | రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.

    రాత్రిపగలు అనే తేడా లేకుండా కుండపోతగా కురుస్తున్నాయి. వరుసగా కురుస్తున్న అతి భారీ వర్షాల వల్ల పలు జిల్లాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి.

    లోతట్టు ప్రాంతాల్లో వరద చేరి, ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాగులు, వంకలు, నదులు పొంగిపోర్లుతున్నాయి. రహదారులపై ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

    ఫలితంగా ప్రజా రవాణా సౌకర్యాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రైల్వే ట్రాక్​లు కొట్టుకుపోవడంతో పలు రైళ్లు సైతం రద్దయ్యాయి. మునుపెన్నడూ లేనివిధంగా మెదక్ జిల్లా (Medak district) లో రైన్​ బరస్ట్​ జరిగింది.

    నిన్న ఉదయం నుంచి నేటి ఉదయం వరకు హావేలిఘనాపూర్ Havelighanapur మండలం సర్దనలో 32.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

    నాగపూర్‌లో 28.3 సెం. మీ, వాడిలో 27 సెం.మీ., చేగుంటలో 24.8 సెం. మీ, రామయంపేటలో 21.3 సెం. మీ వర్షపాతం rainfall నమోదైంది.

    ఈ ప్రాంతంలో ఇంకా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో మెదక్ నుంచి బోధన్, బాన్సువాడ మార్గంలో వెళ్లే బస్సు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

    ఇక రామాయంపేటలో కుండపోత వర్షాల ధాటికి పలు కాలనీలు జలమయయ్యాయి. గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి.

    Revanth visits flooded areas | పోచారం ప్రాజెక్టుకు పొంచి ఉన్న ముప్పు..

    భారీ వరద పోటెత్తడంతో మెదక్ – కామారెడ్డి సరిహద్దుల్లోని పోచారం ప్రాజెక్టు Pocharam project కు ముప్పు పొంచి ఉందని అధికారులు గుర్తించారు.

    ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా హవేలిఘనపూర్ మండలం సర్దన, జక్కన్నపేట ఊర్లలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే ఖాళీ చేయించారు.

    హవేలిఘనపూర్ శివారులో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలను తరలించారు. రెండు గ్రామాల ప్రజలు కూడా అర్ధరాత్రి సమయంలో ఇళ్లను వీడాల్సి వచ్చింది.

    భారీ వర్షాల నేపథ్యంలో ఈ రోజు(ఆగస్టు 28, గురువారం) జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు కలెక్టర్ రాహుల్ రాజ్ సెలవు ప్రకటించారు. అత్యవసరం అయితేనే ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావాలని సూచించారు.

    ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్ ఫోన్​ నంబరు 93919 42254 ను సంప్రదించాలని Collector Rahul Raj సూచించారు.

    Revanth visits flooded areas | సీఎం పర్యటన..

    కుంభవృష్టి నేపథ్యంలో మెదక్‌లో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ముంపు, వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు.

    అధికారులతో సమీక్ష నిర్వహించి, తగు చర్యలపై CM Revanth Reddy దిశానిర్దేశం చేయనున్నారు.

    Latest articles

    Telangana University | వర్షం ఎఫెక్ట్​.. తెయూ పరిధిలో పరీక్షలు వాయిదా

    అక్షరటుడే, డిచ్​పల్లి/కామారెడ్డి: Telangana University | భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో జరగాల్సిన పీజీ పరీక్షలను...

    Pawan Kalyan | ప‌వ‌న్ క‌ళ్యాణ్ మోసం చేశారు.. ఆయ‌న ఆఫీసు ముందు ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేస్తా..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pawan Kalyan | “నా బిడ్డకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గను” అంటూ సుగాలి...

    Kamareddy | వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలి

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | భారీవర్షాల నేపథ్యంలో వైద్యాధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని రాష్ట్ర వైద్య...

    Indian Crickters | ఈ ఏడాది క్రికెట‌ర్స్ అలా రిటైర్ అవుతున్నారేంటి.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎంత మంది గుడ్ బై చెప్పారో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Indian Crickters | 2025 సంవత్సరం భారత క్రికెట్ అభిమానులకు బ్యాడ్ మెమోరీస్‌ని మిగిల్చింది...

    More like this

    Telangana University | వర్షం ఎఫెక్ట్​.. తెయూ పరిధిలో పరీక్షలు వాయిదా

    అక్షరటుడే, డిచ్​పల్లి/కామారెడ్డి: Telangana University | భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో జరగాల్సిన పీజీ పరీక్షలను...

    Pawan Kalyan | ప‌వ‌న్ క‌ళ్యాణ్ మోసం చేశారు.. ఆయ‌న ఆఫీసు ముందు ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేస్తా..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pawan Kalyan | “నా బిడ్డకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గను” అంటూ సుగాలి...

    Kamareddy | వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలి

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | భారీవర్షాల నేపథ్యంలో వైద్యాధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని రాష్ట్ర వైద్య...