అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Weather | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం భారీ వర్షం heavy rain కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ Meteorological Department హెచ్చరించింది.
ఉపరితల ఆవర్తన ధ్రోణి UAC ప్రభావంతో రానున్న మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. నిత్యం వర్షాలు పడుతుండటంతో కొద్ది రోజులుగా ఎండలు తగ్గాయి. ఈ రోజు నుంచి ఉష్ణోగ్రతలు temperature మరింత తగ్గే అవకాశం ఉంది.
Weather | రైతన్నలు బిజీ..
గత కొన్ని రోజులుగా అక్కడక్కడ వర్షాలు పడుతుండటంతో అన్నదాతలు farmers హర్షం వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం సీజన్‌కు సంబంధించి పొలం పనులు ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే దుక్కులు దున్నడం మొదలు పెట్టారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు Southwest monsoon ముందుగానే రాష్ట్రాన్ని తాకుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలపడంతో.. తుకాలు పోయడానికి సిద్ధం అవుతున్నారు.