Weather Updates | రాష్ట్రానికి నేడు భారీ వర్ష సూచన

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురిశాయి. తెలంగాణలో రెండు రోజులుగా వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. శనివారం కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. Weather Updates | ఆ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో నేడు మధ్యాహ్నం, రాత్రి వేళలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురిశాయి. తెలంగాణలో రెండు రోజులుగా వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. శనివారం కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Weather Updates | ఆ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు

రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో నేడు మధ్యాహ్నం, రాత్రి వేళలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. తూర్పు, దక్షిణ తెలంగాణ (Tealngana)లో మాత్రం కుండపోత వాన పడుతుంది. రాత్రి సమయంలో అతి భారీ వర్షాలు పడుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్​నగర్​, నాగర్​ కర్నూల్​, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్​, భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని వివరించారు.

Weather Updates | హైదరాబాద్​ నగరంలో..

హైదరాబాద్​ (Hyderabad) నగరం శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన వర్షం నుంచి ఇంకా తేరుకోలేదు. మరోవైపు నేడు కూడా నగరంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు వాతావరణం పొడిగా ఉంటుంది. సాయంత్రం నుంచి రాత్రి వరకు వర్షం పడే ఛాన్స్​ ఉంది.

Weather Updates | వర్షపాతం వివరాలు

సంగారెడ్డి జిల్లా పుల్కల్​లో శుక్రవారం 129.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లా ధర్మసాగర్​లో 123.5, మేడ్చల్​ జిల్లా బోయిన్​పల్లిలో 115.3, హైదరాబాద్​లోని మారేడ్​పల్లిలో 115, యాదగిరి గుట్టలో 106.5 మి.మీ. వర్షపాతం నమోదైంది.

Weather Updates | రైతుల హర్షం

రాష్ట్రంలో గత పది రోజులుగా వర్షాలు లేకపోవడంతో రైతులు (Farmers) ఆందోళన చెందుతున్నారు. ఈ తరుణంలో వరుణ దేవుడు కరుణించడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వానలు లేక చాలా ప్రాంతాల్లో పంటలు ఎండు ముఖం పట్టాయి. రెండు రోజులుగా కురుస్తున్న వానలతో పంటలకు జీవం వచ్చిందని రైతులు పేర్కొంటున్నారు. అయితే మరో రెండు మూడు రోజులు భారీ వర్షాలు పడితేనే.. చెరువులు నిండి భూగర్భ జలాలు పెరుగుతాయి అంటున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...