HomeUncategorizedheart attack | అలెర్ట్​.. చలికాలంలో జాగ్రత్తలు తీసుకోకుంటే గుండెకు తీవ్ర ముప్పు.. డాక్టర్​ జగదీష్...

heart attack | అలెర్ట్​.. చలికాలంలో జాగ్రత్తలు తీసుకోకుంటే గుండెకు తీవ్ర ముప్పు.. డాక్టర్​ జగదీష్ చంద్రబోస్​

heart attack | చలికాలం గుండె సంబంధిత వ్యాధుల భారిన పడే ఆస్కారం ఎక్కువ.. తగు జాగ్రత్తలు పాటించకుంటే ప్రమాదమే..

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: heart attack | చలికాలం గుండె సంబంధిత వ్యాధుల భారిన పడే ఆస్కారం ఎక్కువ.. తగు జాగ్రత్తలు పాటించాలని ప్రముఖ కార్డియాలజిస్ట్ cardiologist, నిజామాబాద్ మెడికవర్ హాస్పిటల్స్ Nizamabad Medicover Hospitals డాక్టర్ జగదీష్ చంద్రబోస్ సూచించారు. చలికాలంలో చిన్న, పెద్ద అని తేడా లేకుండా గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారని డాక్టర్ పేర్కొన్నారు.

వాతావరణంలో చలి తీవ్రతలో మార్పులు వచ్చినప్పుడు రక్తనాళాలు కుంచించుకుపోవడం వల్ల రక్తపోటు పెరగడం, హృదయంపై ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు ప్రధాన కారణాలని డాక్టర్​ వివరించారు.

ముఖ్యంగా తెల్లవారుజామున చలి తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో గుండె పోటు వచ్చే ఆస్కారం అధికంగా ఉంటుందని చెప్పారు.

తక్కువ ఉష్ణోగ్రతల సమయంలో శరీరం వేడి నిలుపుకోవడానికి గుండె ఎక్కువగా పనిచేయాల్సి వస్తుందని తెలిపారు. ఈ ఒత్తిడి వయసు పైబడినవారికి, ముందే గుండె వ్యాధులు ఉన్నవారికి, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ ఉన్నవారిపై ఎక్కువగా ఉంటుందని చెప్పారు.

చాలా మంది ఈ లక్షణాలను సాధారణ చలి అలసటగా భావించి నిర్లక్ష్యం చేస్తారని, ఇది తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుందని డాక్టర్​ హెచ్చరించారు.

heart attack | డాక్టర్ సూచించిన జాగ్రత్తలు ఇవే..

  • తెల్లవారుజామున, రాత్రి వేళల్లో తీవ్రమైన చలిలో బయటకు వెళ్లడం తగ్గించాలి. శరీరాన్ని వేడిగా ఉంచేందుకు తగు దుస్తులు ధరించాలి.
  • షుగర్, బీపీ, కొలెస్ట్రాల్‌ను క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలి.
  • ఛాతి బరువుగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆకస్మిక చెమటలు, చేతికి / మోచేతికి నొప్పి వంటి లక్షణాలు కనబడితే వెంటనే వైద్యులను సంప్రదించి తగు చికిత్స తీసుకోవాలి.
  • ధూమపానం, మద్యపానం పూర్తిగా మానేయాలి.
  • గోరు వెచ్చని నీరు, పోషకాహారం, తేలికపాటి వ్యాయామం చలికాలంలో గుండెకు రక్షణగా ఉంటాయి.

చలికాలంలో గుండె వ్యాధుల లక్షణాలు చాలా వేగంగా ముదిరే అవకాశాలు ఉన్నందున, ఏ చిన్న మార్పునైనా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తక్షణ వైద్య సేవలు అందించే ఆస్పత్రులను, వైద్యులను సంప్రదించాలని డాక్టర్ జగదీష్ చంద్రబోస్ సూచించారు.

Must Read
Related News