అక్షరటుడే, వెబ్డెస్క్ : BC Reservations | బీసీ రిజర్వేషన్లపై విచారణనున హైకోర్టు మధ్యాహ్నానికి వాయిదా వేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే.
ప్రభుత్వ జీవోకు వ్యతిరేకంగా మాధవరెడ్డి అనే వ్యక్తి హైకోర్టు (High Court)ను ఆశ్రయించారు. దీనిపై గతంలోనే హైకోర్టు విచారణ జరిపింది. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఉండగా.. జీవో జారీ చేయాల్సిన అవసరం ఏముందని కోర్టు ప్రశ్నించింది.
BC Reservations | మొత్తం ఆరు పిటిషన్లు
బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా బీసీ సంఘాల నాయకుడు ఆర్ కృష్ణయ్య ఇంప్లిడ్ పిటిషన్ దాఖలు చేశారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మరికొంత మంది పిటిషన్లు వేశారు. వీటిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. మొదట 10:45 గంటలకు విచారణ ప్రారంభం అయింది. రిజర్వేషన్లపై ప్రస్తుత పరిస్థితి ఏంటని ప్రధాన న్యాయమూర్తి అడిగారు. దీంతో ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయిందని లాయర్లు తెలిపారు. దీనిపై మొత్తం 6 పిటిషన్లు దాఖలు కావడంతో అన్నింటిని మధ్యాహ్నం 12:30 గంటలకు విచారిస్తామని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. సుప్రీంకోర్టు పిటిషన్ను కొట్టేసిన విషయాన్ని సైతం న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.