అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Harish Rao | ఫోన్ ట్యాపింగ్ కేసులో (phone tapping case) మాజీ మంత్రి హరీశ్‌రావు విచారణ ముగిసింది. దాదాపు ఏడు గంటల పాటు సిట్ విచారణ సాగింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6.25 గంటల వరకు అధికారులు ఆయనను ప్రశ్నించారు.
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు హరీశ్‌రావును (Harish Rao) సుదీర్ఘంగా విచారించారు. ఉదయం 11 గంటకు హరీశ్‌రావు ఠాణాకు చేరుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు, న్యాయవాదులను లోనికి అనుమతించలేదు. సాయంత్రం ఆరు దాటిన హరీశ్‌రావును బయటకు పంపకపోవడంతో బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున ఠాణా వద్దకు చేరుకొని నిరసన తెలిపారు. అయితే ఆయన 6:30 గంటలకు ఠాణా బయటకు వచ్చారు. అనంతరం కార్యకర్తలకు అభివాదం చేస్తూ తన కారులో తెలంగాణ భవన్‌కు బయలుదేరారు. అక్కడ హరీశ్‌రావు మీడియాతో మాట్లాడనున్నట్లు తెలిసింది.
Harish Rao | బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్
హరీశ్‌రావు బయటకు రాకముందు పోలీసులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు. ఠాణాలోకి చొచ్చుకు వెళ్లుందుకు పలువురు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తోపులాటలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ అస్వస్థతకు గురై పడిపోయాడు. ఆరు గంటలకు పైగా విచారణ కొనసాగుతుండటంతో కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy), కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆగ్రహంతో నినాదాలు చేశారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.