అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్‌రావును సిట్ అధికారులు నేడు విచారించనున్నారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. బీఆర్ఎస్ హయాంలో పలువురి ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై గతంలోనే కేసు నమోదు కాగా.. ఇటీవల ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. సిట్ అధికారులు (SIT Officers) విచారణ వేగవంతం చేశారు. ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావును కస్టడీకి తీసుకొని విచారించారు. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్‌రావును విచారించారు. అలాగే ఆయన తండ్రి, కూకట్పల్లి ఎమ్మెల్యే కుమారుడికి నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో సోమవారం సాయంత్రం హరీశ్‌రావు (Harish Rao)కు నోటీసులు ఇచ్చారు.
Phone Tapping Case | హరీశ్‌రావు నివాసానికి కేటీఆర్
సిట్ విచారణ నేపథ్యంలో ఉదయం 9 గంటలకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో హరీశ్ రావు సమావేశం నిర్వహించారు. సమావేశం తర్వాత జూబ్లీహిల్స్ పీఎస్ (Jubilee Hills PS)లో విచారణకు హాజరు కానున్నారు. ఈ కేసులో హరీశ్ రావు పాత్ర కూడా కీలకంగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని హరీశ్‌రావు నివాసానికి కేటీఆర్ (KTR) చేరుకున్నారు. లీగల్ టీమ్‌తో సంప్రదింపులు కేటీఆర్, హరీశ్‌రావు సంప్రదింపులు జరుపుతున్నారు. సిట్ విచారణలో విచారణలో ఏ అంశాలు మాట్లాడాలి అనేదానిపై చర్చిస్తున్నట్లు సమాచారం. మరోవైపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద 300 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు.హరీశ్‌రావుకు నోటీసులు అందించడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. అప్పటి ప్రభుత్వ పెద్దల నిర్ణయం మేరకు ఫోన్ ట్యాప్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో హరీశ్‌రావు, కేసీఆర్‌కు నోటీసులు వస్తాయని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు (Municipal Elections) సిద్ధం అవుతున్న తరుణంలో ఆయనను విచారణకు పిలవడం గమనార్హం.