అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Harish Rao | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR)తో మాజీ మంత్రి హరీశ్‌రావు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం భేటీ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ (SIT investigation) వివరాలను ఆయనకు వివరించారు.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం హరీశ్‌రావును ఏడు గంటల పాటు చర్చించారు. తన కుమారుడు అమెరికాకు వెళ్తున్నాడని చెప్పడంతో విచారణ త్వరగా ముగించినట్లు పోలీసులు తెలిపారు. మరోసారి ఆయనను విచారణకు పిలిచే అవకాశం ఉందని సైతం పేర్కొన్నారు. ఈ క్రమంలో సిట్ విచారణపై హరీశ్‌రావు కేసీఆర్‌తో చర్చించారు. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలు, తాను ఇచ్చిన సమాధానాలపై చర్చించినట్లు సమాచారం.
Harish Rao | కొలిక్కి వచ్చేనా..
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఎంతకు కొలిక్కి రావడం లేదు. కేసు నమోదు అయి రెండేళ్లు కావొస్తుంది. అయినా కానీ విచారణ సాగుతూనే ఉంది. ఇటీవల ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. దీనికి హైదరాబాద్ సీపీ (Hyderabad CP) సజ్జనార్ నేతృత్వం వహిస్తున్నారు. సిట్ అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుతో పాటు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్‌రావు, ఓ ఛానెల్ మాజీ ఎండీ శ్రవణ్‌రావును విచారించారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా హరీశ్‌రావును ప్రశ్నించినట్లు సమాచారం.
విచారణలో భాగంగా సిట్ అధికారులు హరీశ్‌రావుకు షాకింగ్ న్యూస్ చెప్పినట్లు తెలిసింది. ఆయన ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని తెలిపినట్లు సమాచారం. హరీశ్‌రావుతో పాటు ఆయన అనుచరులు, కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేశారని, ఆ వివరాలను హరీశ్‌రావు ముందు సిట్ అధికారులు ఉంచినట్లు సమాచారం.