అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hardhik Pandya | ఆసియా కప్ 2025 ప్రారంభానికి ముందు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అభిమానులకు ఒక పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చాడు. యూఏఈ వెళ్లిన వెంటనే కొత్తగా హెయిర్ స్టైల్ చేయించుకొని, స్టైలిష్ లుక్‌లో ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు.
“New Me” అనే క్యాప్షన్(New Me Caption)తో పోస్ట్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. గురువారం టీమిండియా ఆటగాళ్లతో పాటు హార్దిక్ పాండ్యా యూఏఈకి బయలుదేరాడు. ఎయిర్‌పోర్ట్‌లో కనిపించినపుడు సాధారణ హెయిర్ స్టైల్‌లో ఉన్న అతడు, దుబాయ్‌కు చేరుకున్న తర్వాతే తన హెయిర్ స్టైల్(Hair Style) మార్చుకున్నట్లు తెలుస్తోంది. జుట్టును కత్తిరించడమే కాకుండా, నయా కలర్ కూడా వేయించుకుని ట్రెండీ లుక్‌ను అభిమానుల ముందుంచాడు.
Hardhik Pandya | “కుంగ్ ఫూ పాండ్యా ఈజ్ బ్యాక్”
ఇప్పటికే పలు సందర్భాల్లో హెయిర్ స్టైల్స్‌తో ఆకట్టుకున్న హార్దిక్(Hardhik Pandya)కి “కుంగ్ ఫూ పాండ్యా” అనే ముద్దు పేరు ఫ్యాన్స్ పెట్టారు. తాజా లుక్ చూసిన నెటిజన్లు, “ఇదే మా స్టైలిష్ పాండ్యా”, “బాస్ ఈజ్ బ్యాక్” అంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో కామెంట్లు పెడుతున్నారు. పాత లుక్స్‌తో పాటు ప్రస్తుత ఫోటోలను కూడా షేర్ చేస్తూ తెగ చర్చించుకుంటున్నారు. సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ 2025(Asia Cup 2025) ప్రారంభం కానుంది. భారత్ జట్టు తొలి మ్యాచ్ సెప్టెంబర్ 10న యూఏఈతో, అలాగే సెప్టెంబర్ 14న పాకిస్థాన్‌తో తలపడనుంది. ఇప్పటికే టీమిండియా యూఏఈ చేరగా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్ తదితర ఆటగాళ్లు వేర్వేరు సమయాల్లో దుబాయ్‌కి చేరారు.
గతంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో భారత్ తరఫున మెరిసిన హార్దిక్, అప్పటినుంచి మంచి ఫామ్ కొనసాగిస్తున్నాడు. అలాగే ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ జట్టును క్వాలిఫయర్ 2 వరకు తీసుకెళ్లాడు. అయితే పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడి ముంబై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు ఆసియా కప్‌లో పాండ్యా మంచి ప్రదర్శన ఇవ్వాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఏది ఏమైన తన న్యూ హెయిర్ స్టైల్‌తో పాండ్యా ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాడు.