Shalini Pandey | అర్జున్ రెడ్డి బ్యూటీకి బ‌ర్త్ డే విషెస్.. టాలెంట్ ఉన్నా దక్కని అవ‌కాశాలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shalini Pandey | టాలీవుడ్‌లో ఒక్క హిట్ వ‌స్తే చాలు వారి దశ తిరుగుతుంది అని అంటారు. కొందరు హీరోయిన్స్ మాత్రం వ‌చ్చిన‌ ఆ ఒక్క ఛాన్స్‌ను బాగా వాడుకుని స్టార్‌డమ్ అందుకుంటే, మరికొందరు తొలి విజయం తర్వాత జాడ లేకుండా పోతుంటారు. అలాంటి పరిస్థితే ప్రస్తుతం ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) ఫేమ్ షాలిని పాండే ఎదుర్కొంటోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విడుదలైన అర్జున్ రెడ్డి (2017) సినిమాతో హీరోయిన్‌గా […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shalini Pandey | టాలీవుడ్‌లో ఒక్క హిట్ వ‌స్తే చాలు వారి దశ తిరుగుతుంది అని అంటారు. కొందరు హీరోయిన్స్ మాత్రం వ‌చ్చిన‌ ఆ ఒక్క ఛాన్స్‌ను బాగా వాడుకుని స్టార్‌డమ్ అందుకుంటే, మరికొందరు తొలి విజయం తర్వాత జాడ లేకుండా పోతుంటారు.

అలాంటి పరిస్థితే ప్రస్తుతం ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) ఫేమ్ షాలిని పాండే ఎదుర్కొంటోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విడుదలైన అర్జున్ రెడ్డి (2017) సినిమాతో హీరోయిన్‌గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన షాలినికి, ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయంతో ఓవర్‌నైట్‌గా స్టార్ ఇమేజ్ వచ్చింది. విజయం తర్వాత వరుసగా ఆఫర్స్ వచ్చినా, అవి అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. ఇప్పటివరకు ఆమె తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కలిపి సుమారు 12 సినిమాల్లో నటించింది.

Shalini Pandey | హ్యాపీ బ‌ర్త్ డే..

అర్జున్​ రెడ్డి తర్వాత నటించిన సినిమాల్లో ఏ సినిమా కూడా ఈ అమ్మ‌డి ఫేట్ మార్చ‌లేక‌పోయాయి. అయితే ఒక‌టి రెండు సినిమాలు (118 వంటి సినిమాలు) సరే అనిపించినా, మిగతావన్నీ ఫ్లాప్ టాక్‌నే మూటగట్టుకున్నాయి. సినిమాల్లో ఆశించిన స్థాయిలో నిలదొక్కుకోలేకపోయినా, షాలిని సోషల్ మీడియా ద్వారా మాత్రం సంద‌డి చేస్తూనే ఉంది. తరచూ గ్లామరస్ ఫోటోషూట్స్, స్టైలిష్ లుక్స్‌తో నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. ఆమె పోస్ట్ చేసే ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూ, అభిమానుల నుంచి బోలెడు రెస్పాన్స్ అందుకుంటున్నాయి. కామెంట్లలో చాలామంది ఆమె అందానికి ఫిదా అవుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

అభినయం, అందం రెండూ ఉన్నా కెరీర్​లో మాత్రం నిలదొక్కుకోలేకపోవడం ఆమె అభిమానుల‌ని ఎంతో బాధిస్తుంది. బాలీవుడ్‌లో కూడా ప్రయోగాలు చేస్తున్న షాలిని, మళ్లీ ఓ మేజర్ హిట్‌తో రీ ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి. ప్రస్తుతం కెరీర్‌లో కాస్త వెనుకబడిన ఈ ముద్దుగుమ్మ, సోషల్ మీడియా హవాతో మాత్రం కుర్రకారును మాయ చేస్తోంది. అయితే ఈ రోజు ఈ అమ్మ‌డి బ‌ర్త్ డే కాగా, శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. ప‌లువురు అభిమానులు, సినీ ప్ర‌ముఖులు షాలిని పాండేకి (Shalini Pandey) విషెస్‌ల వెల్లువ కురిపిస్తున్నారు. కాగా, షాలిని పాండే సెప్టెంబ‌ర్ 23, 1993న జ‌న్మించింది. నేటితో ఈ అమ్మ‌డు 32వ వ‌సంతంలోకి అడుగుపెట్టింది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...