అక్షరటుడే, కోటగిరి : Pothangal | యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు దేశంలో ఎక్కడా లేవని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) అన్నారు. పోతంగల్ మండలంలోని పీఎస్ఆర్ నగర్లో స్కూల్ నిర్మాణానికి జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేశ్ షెట్కార్, ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్‌తో (Kasula Balaraj) కలిసి భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. పాఠశాల భవన (school building) నిర్మాణం కోసం రూ.200 కోట్లు మంజురయ్యాయన్నారు. అన్ని వసతులతో కూడిన పాఠశాల భవనం నిర్మించబోతున్నామన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్లో విద్యార్థులు మూడు వేల మంది పిల్లలు చదువుతారన్నారు. అందులో క్రికెట్, వాలీబాల్ గ్రౌండ్, విశాలమైన భవనాలు రోడ్లు, ఉంటాయని వివరించారు.
ఎంపీ సురేశ్ షెట్కార్ (MP Suresh Shetkar) మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలకు మంచి చదువు ఇవ్వాలని ఉద్దేశంతో మారుమూల గ్రామంలో పీఎస్ఆర్ గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అభివృద్ధిలో ముందుకు వెళ్తోందన్నారు.
కాసుల బాలరాజ్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం (Indiramma houses), ఇందిరమ్మ చీరలు, మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత కరెంటు సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. డ్వాక్రా, మహిళా సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో (Bodhan Sub-Collector Vikas Mahato), డీఈ రవి, ఏఎంసీ ఛైర్మన్ గైక్వాడ్ హన్మంత్, తహశీల్దార్ గంగాధర్, కోటగిరి ఎంపీడీవో విష్ణు, చందర్, మాజీ జడ్పీటీసీ శంకర్ పటేల్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పుప్పాల శంకర్, జిల్లా యూత్ అధ్యక్షుడు మధుసూదన్, మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్, ఎజాజ్ ఖాన్, కేశ వీరేశం, అనంత విఠల్, గంట్ల విఠల్, బర్ల మధు, హంగర్గ గంగాధర్, నాగరాజ్ గౌడ్, మానిక్ అప్ప, పోచిరాం, మాధవరావు పటేల్, రాంబాబు, జగన్, ధన్‌రాజ్, రాజు, చిన్న, దత్తు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
