Pothangal | పోతంగల్​ చెక్​పోస్టు వద్ద కంకర లారీ బోల్తా..

అక్షరటుడే, కోటగిరి: Pothangal | కంకర లారీ బోల్తా పడిన ఘటన పోతంగల్​ చెక్​పోస్టు వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బీర్కూర్ నుంచి కోటగిరి మండలం ఎత్తొండ వెళ్తున్న లారీ ఆదివారం ఉదయం బోల్తా పడింది. కెనాల్ వర్క్ కోసం కంకరతో వెళ్తున్న లోడ్ లారీ అదుపుతప్పి బోల్తా కొట్టింది. బీర్కూర్ మంజీర బ్రిడ్జి నుంచి వెళ్తుండగా పోతంగల్ చెక్ పోస్ట్ వద్ద ఈ ఘటన జరిగింది. బ్రేక్ వీల్ పని చేయకపోవడంతో 33 […]

అక్షరటుడే, కోటగిరి: Pothangal | కంకర లారీ బోల్తా పడిన ఘటన పోతంగల్​ చెక్​పోస్టు వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బీర్కూర్ నుంచి కోటగిరి మండలం ఎత్తొండ వెళ్తున్న లారీ ఆదివారం ఉదయం బోల్తా పడింది. కెనాల్ వర్క్ కోసం కంకరతో వెళ్తున్న లోడ్ లారీ అదుపుతప్పి బోల్తా కొట్టింది. బీర్కూర్ మంజీర బ్రిడ్జి నుంచి వెళ్తుండగా పోతంగల్ చెక్ పోస్ట్ వద్ద ఈ ఘటన జరిగింది. బ్రేక్ వీల్ పని చేయకపోవడంతో 33 కేవీ 11 కేవీ స్తంభాలను ఢీ కొట్టడంతో విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ చాంద్ పాషాకు ఎలాంటి గాయాలు కాలేదు.

Pothangal | గతంలోనూ ప్రమాదాలు

చెక్​పోస్టు సమీపంలో గతంలోనూ పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. సమీపంలో ఉన్న కాలువపై కల్వర్టుకు సైడ్​వాల్స్​ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. గతంలోనూ ఓ కారు బోల్తా పడింది. అధికారులు స్పందించి కల్వర్టుపై సైడ్​వాల్స్​ నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

Balla Sandeep Kumar
Balla Sandeep Kumar
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2006 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...