HomeతెలంగాణKonda Surekha OSD | ప్రభుత్వం కీలక నిర్ణయం.. మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ తొలగింపు

Konda Surekha OSD | ప్రభుత్వం కీలక నిర్ణయం.. మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ తొలగింపు

Konda Surekha OSD | మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్​ను ప్రభుత్వం తొలగించింది. ఆయనపై పలు ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Konda Surekha OSD | మంత్రుల మధ్య వివాదాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్​ను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖకు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(OSD)గా గతంలో ప్రభుత్వం సుమంత్​ను నియమించింది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి( TGPCB)లో కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న ఆయన మంత్రి పేషీకి డిప్యూటేషన్‌పై వచ్చారు. అనంతరం ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయి. మంత్రుల మధ్య విభేదాలు వచ్చేలా సమాచారాన్ని లీక్​ చేశారని ఫిర్యాదులు అందాయి. దీంతో ప్రభుత్వం ఆయనపై చర్యలు చేపట్టింది.

Konda Surekha OSD | మేడారం పనుల్లో..

రాష్ట్రంలో మేడారం మహాజాతర (Medaram Mahajatara)కు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇందుకు సంబంధించి పనుల విషయంలో ఇటీవల మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి మధ్య విభేదాలు నెలకొన్న విషయం తెలిసింది. దీనికి కారణం సుమంత్​ అని ప్రభుత్వానికి తెలిసింది. అంతేగాకుండా మేడారం పనుల్లో సైతం గోల్​మాల్​కు యత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి.

Konda Surekha OSD | ఇంటెలిజెన్స్​ నివేదికతో..

కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో పాటు సెటిల్మెంట్లు చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్​ అధికారులు సీఎంవోకు నివేదిక అందజేశారు. అటవీ శాఖలో డిప్యుటేషన్లు, బదిలీల్లో సైతం ఆయన తలదూర్చేవారని సమాచారం. ఐఏఎస్ స్థాయి అధికారులకు సైతం ఆయన ఆదేశాలు జారీ చేసేవారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో అయినపై వచ్చిన తీవ్రమైన ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో ఓఎస్డీగా తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుమంత్​ సేవలను తక్షణమే రద్దు చేస్తూ టీజీపీసీబీ సైతం ఉత్తర్వులు జారీ చేసింది.