Homeతాజావార్తలుRTC Hire Buses | ప్రభుత్వం కీలక నిర్ణయం.. మహిళా సంఘాలకు మరో 448 అద్దె...

RTC Hire Buses | ప్రభుత్వం కీలక నిర్ణయం.. మహిళా సంఘాలకు మరో 448 అద్దె బస్సులు

మహిళాశక్తి పథకం కింద మరో 448 బస్సులను అద్దె ప్రాతిపాదికన ఆర్టీసీకి కేటాయించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు మంత్రులు పొన్నం ప్రభాకర్​, సీతక్క వివరాలు వెల్లడించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : RTC Hire Buses | రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీలో మహిళా సంఘాల నుంచి మరో 448 అద్దె బస్సులను కేటాయించింది. ఈ మేరకు మంత్రులు పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar)​, సీతక్క (Seethakka) సోమవారం వివరాలు వెల్లడించారు.

రాష్ట్రంలో మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ లక్ష్యమని ప్రభుత్వం చెబుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే 152 అద్దె బస్సులను మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీకి కేటాయించింది. అంతేగాకుండా పెట్రోల్​ బంకులు, సోలార్​ ప్లాంట్లు (Solar Plants) ఏర్పాటు చేసుకోవడానికి మహిళలకు చేయూత అందిస్తోంది. తాజాగా మహిళాశక్తి పథకం కింద మరో 448 బస్సులను అద్దె ప్రాతిపాదికన ఆర్టీసీకి కేటాయించనున్నట్లు మంత్రులు తెలిపారు.

RTC Hire Buses | అనుమతులు రాగానే..

మహిళా స్వయం సహాయక సంఘాలకు మరిన్ని ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు మంత్రి పొన్నం తెలిపారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 152 ఆర్టీసీ అద్దె బస్సులను మండల మహిళా సమాఖ్యలు విజయవంతంగా నిర్వహిస్తున్నాయని చెప్పారు. మహిళను ఆర్థికంగా బ‌తోపేతం చేసే లక్ష్యంతో మరో 448 అద్దె బ‌స్సుల‌ను అప్పగించే ప్రక్రియ చివరి దశలో ఉందన్నారు. ఈ నేపథ్యంలో సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్ (SERP CEO Divya Devarajan), ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి తాజాగా లేఖ రాశారు.

మండల మహిళా సమాఖ్యల ద్వారా బస్సులు కొనుగోలు చేసి, ఆర్టీసీకీ అద్దెకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అనుమతులు మంజూరైన వెంట‌నే, బస్సులను అప్పగిస్తామన్నారు. కాగా ఒక్కో బస్సు ద్వారా మహిళా సంఘాలకు నెలకు సుమారు రూ.70 వేల వరకు అద్దె వస్తున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. మహిళా సాధికారతకు దోహదపడేలా తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. మహిళా సంఘాల నిబద్ధత, క్రమశిక్షణ రాష్ట్ర ప్ర‌జా రవాణా రంగానికి కొత్త దిశను చూపుతుందన్నారు. భవిష్యత్తులో ఈ పథకాన్ని మరింత విస్తృతం చేస్తామని పేర్కొన్నారు.

Must Read
Related News