అక్షరటుడే, వెబ్డెస్క్ : Kalti Kallu | రాష్ట్రంలో కల్తీ కల్లు (Kalti Kallu)పై ప్రభుత్వం సీరియస్గా ఉంది. ఇటీవల కూకట్పల్లి (Kukatpalli)లో కల్తు కల్లు తాగి తొమ్మిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కల్తీ కల్లు ఘటనలు వరుసగా చోటు చేసుకుంటుండంతో ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. కల్తీ కల్లుపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించింది.
Kalti Kallu | కల్లు బట్టీల్లో తనిఖీలు
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎక్సైజ్ అధికారులు కల్లు కాంపౌండ్లపై స్పెషల్ డ్రైవ్ (Special Drive) నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కలు బట్టీలలో తనిఖీలు చేపడుతున్నారు. టాస్క్‌ఫోర్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలను మరింత విస్తృతం చేయనున్నారు.
కల్లును అక్రమంగా రవాణా చేస్తున్నవారు, కల్తీ కల్లు తయారు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధం అవుతున్నారు. లైసెన్స్ లేని కల్లు కాంపౌండ్లు సీజ్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కల్లు దందాల్లో సిండికేట్ వ్యవస్థను ట్రేస్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టనున్నారు.