Homeతాజావార్తలుI Bomma | సినీ ప్రియుల‌కి పండ‌గ‌.. మ‌ళ్లీ ఐ బొమ్మ వ‌చ్చేసిందిగా..!

I Bomma | సినీ ప్రియుల‌కి పండ‌గ‌.. మ‌ళ్లీ ఐ బొమ్మ వ‌చ్చేసిందిగా..!

సైబర్‌క్రైమ్‌ పోలీసులు ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన తర్వాత, పైరసీ సైట్‌ను పూర్తిగా మూసివేశారు. దీంతో ఇకపై ఐబొమ్మలో సినిమాలు కనిపించవు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : I Bomma | ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ నిర్వహకుడు ఇమ్మడి రవిని ఇటీవల సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్ తరువాత అసలు వెబ్‌సైట్ పూర్తిగా షట్‌డౌన్ అయి, ఇక అక్కడ సినిమాలు కనిపించడం ఆగిపోయింది.

దీంతో పోలీసులు, సినీ పరిశ్రమ పెద్దలూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. ఎందుకంటే తాజాగా ఆన్‌లైన్‌లో ‘iBOMMA 1’ అనే కొత్త వెబ్‌సైట్ ప్రత్యక్షమైంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే,అందులో కొత్త సినిమాలు కూడా కనిపిస్తున్నాయి.

I Bomma | భ‌య‌ప‌డే ప్ర‌సక్తే లేదు..

ఏదైనా సినిమా లింక్‌పై క్లిక్ చేస్తే అది నేరుగా పైరసీకి కేరాఫ్‌గా పేరుగాంచిన మూవీ రూల్జ్ వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్ అవుతోందని పోలీసులు గుర్తించారు. సైబర్ క్రైమ్ అధికారుల (Cybercrime Officers) అంచనా ప్రకారం—ఐబొమ్మకు సంబంధించిన 65కిపైగా మిర్రర్ వెబ్‌సైట్లు ఉన్నాయని, వాటిలో ఒకదాన్ని ఇప్పుడు ‘iBOMMA 1’ పేరిట మళ్లీ ప్రాచుర్యంలోకి తెచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు.ఈ పరిణామంతో పోలీసులు మళ్లీ అప్రమత్తమయ్యారు. మూవీ రూల్జ్, తమిళ్/MV వంటి ఇతర పైరసీ ప్లాట్‌ఫామ్‌లపై కూడా కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు.ఐబొమ్మ (I Bomma) మళ్లీ కొత్త పేరుతో కనిపించడంతో కొంతమంది సినిమా అభిమానులు ఆనందపడుతుంటే… నిర్మాతలు మాత్రం విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పైరసీ సమస్య మళ్లీ తలెత్తడంతో ఇది ఇండస్ట్రీకి భారీ నష్టమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఈ సారి పైరసీ రూట్స్ పూర్తిగా కట్ చేయగలరా? పోలీసుల తదుపరి చర్యలపై అందరి దృష్టి నిలిచింది. కాగా, పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవిని సైబర్‌క్రైమ్ పోలీసులు (Cyber Crime Police) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాంపల్లి కోర్టు అనుమతితో ఆయనను ఐదు రోజుల పోలీసు కస్టడీలో విచారిస్తున్నారు. దర్యాప్తు సాగుతున్న కొద్దీ రవి వ్యక్తిగత జీవితం, ఆర్థిక వ్యవహారాలపై పలు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. పోలీసుల పరిశీలన ప్రకారం రవి (Immadi Ravi) పైరసీ ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి ఆయన వ్యక్తిగత జీవితంలో ఎదురైన చేదు అనుభవాలే కీలక కారణంగా తేలింది. రవి అమీర్‌పేట్‌లోని ఒక కోచింగ్ సెంటర్‌లో చదివే సమయంలో ఓ యువతిని పరిచయం చేసుకుని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వారికి ఓ కుమార్తె కూడా ఉంది. అయితే వ్యక్తిగత జీవితంలో ఏర్ప‌డిన‌ విబేధాలు, ఆర్థిక ఇబ్బందులు అతడు దారి త‌ప్పేలా చేసాయ‌ని దర్యాప్తులో బయటపడింది.