ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​Union Cabinet | విద్యార్థులకు గుడ్​న్యూస్​.. ఐదు ఐఐటీల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

    Union Cabinet | విద్యార్థులకు గుడ్​న్యూస్​.. ఐదు ఐఐటీల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Union Cabinet : దేశంలో ఐదు ఐఐటీల (IITs) విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోని ఐఐటీ తిరుపతి (IIT Tirupati), కేరళలోని ఐఐటీ పాలక్కాడ్ (IIT Palakkad), ఛత్తీస్‌గఢ్‌లోని ఐఐటీ భిలాయ్ (IIT Bhilai), జమ్మూకశ్మీర్‌లోని ఐఐటీ జమ్మూ (IIT Jammu), కర్ణాటకలోని ఐఐటీ ధార్వాడ్‌ (IIT Dharwad) విస్తరణకు మార్గం సుగమమైంది.

    ఐఐటీల విస్తరణను “ఫేజ్-బీ నిర్మాణం” (Phase-B structure) పేరుతో చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం ₹11,828.79 కోట్లు కేటాయించింది. ఈ విస్తరణ పనులు 2028-29 నాటికి పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రణాళికలో భాగంగా కొత్తగా 130 ప్రొఫెసర్ స్థాయి (లెవల్-14 పైగా) పోస్టులు మంజూరుకానున్నాయి.

    ఐదు ఆధునిక పరిశోధనా పార్కులు (modern research parks) నెలకొల్పుతారు. వీటి ఏర్పాటు పరిశ్రమ – విశ్వవిద్యాలయ భాగస్వామ్యాన్ని (industry-university partnerships) బలపర్చేందుకు దోహదపడుతుంది. ఈ విస్తరణతో సదరు ఐఐటీల్లో విద్యార్థుల సంఖ్య ఏటా పెరిగేలా ప్రణాళిక రూపొందించారు. మొదటి సంవత్సరం 1,364 మంది, రెండో సంవత్సరం 1,738, మూడవ సంవత్సరం 1767, నాలుగో సంవత్సరం 1,707 సీట్ల మంజూరుతో కొత్తగా మొత్తం 6,576 మంది విద్యార్థులకు సాంకేతిక విద్య అందుకునే అవకాశం లభించబోతోంది. అంటే ప్రస్తుతం 7,111 మంది ఉన్నారు. వీరితో కలిపి మొత్తం 13,687 మంది విద్యార్థులకు అత్యున్నత సాంకేతిక విద్య అందబోతోంది.

    ఈ విస్తరణ ప్రాజెక్టుతో దేశవ్యాప్తంగా విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. వారి నైపుణ్యాలు పెంచడం, కొత్తగా ఉపాధి అవకాశాలు కల్పించడం, పరిశోధన, స్టార్టప్‌లు, పెంచడం వంటి వాటి అభివృద్ధికి దోహదపడుతుంది.

    ఈ ఐదు ఐఐటీలను 2015 తర్వాత స్థాపించారు. ఐఐటీ పాలక్కాడ్​ (IIT Palakkad), ఐఐటీ తిరుపతి (IIT Tirupati) 2015-16లో ప్రారంభించారు. ఐఐటీ భిలాయ్ (IIT Bhilai), జమ్మూ, ధార్వాడ్‌ (IIT Dharwad) 2016-17లో మొదలయ్యాయి. ప్రారంభంలో తాత్కాలిక క్యాంపస్​లలో కొనసాగించారు. ఇప్పుడు ఇవి శాశ్వత భవనాల్లోకి మారాయి.

    More like this

    Local Body Elections | స్థానిక ఎన్నికలపై కీలక అప్​డేట్​.. రిజర్వేషన్ల పెంపునకు గవర్నర్​ ఆమోదం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Local Body Elections | స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్​డేట్​ వచ్చింది. బీసీ...

    Sriram Sagar | శ్రీరాంసాగర్ వరద గేట్ల మూసివేత

    అక్షరటుడే, బాల్కొండ: Sriram Sagar | తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి (Sriram Sagar Project) వరద తగ్గుముఖం...

    Yellareddy | చెరువు బాగు కోసం రైతులంతా ఏకమయ్యారు..

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా గ్రామస్థులు తమ చెరువును...