అక్షరటుడే, వెబ్డెస్క్ : Dussehra Holidays | దసరా వచ్చిందంటే విద్యార్థులు ఎగిరి గంతేస్తారు. వరుస సెలవుల్లో ఎంజాయ్ చేయాలని ప్లాన్లు వేసుకుంటారు.
దసరా సెలవులు(Dussehra Holidays) ఎప్పుటి నుంచని విద్యార్థులు ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలకు దసరా సెలవులను ప్రకటించింది. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు పాఠశాలలకు సెలవులు ఇచ్చింది. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు జూనియర్ కళాశాలలకు(Junior Colleges) సెలవులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Dussehra Holidays | బతుకమ్మ వేడుకలు
రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ, దసరా పండుగలు ఘనంగా జరగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగను తెలంగాణ(Telangana) ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. అక్టోబర్ 2న దసరా పండుగ ఉంది. ప్రభుత్వం బతుకమ్మ వేడుకల కోసం బడులకు సెప్టెంబర్ 21 నుంచి సెలవులు ఇచ్చింది. మొత్తం 13 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. దీంతో విద్యార్థులు(Students) ఎగిరి గంతేస్తున్నారు.
Dussehra Holidays | తల్లిదండ్రులు జాగ్రత్త
సెలవులు వచ్చాయంటే విద్యార్థులు ఇంటి దగ్గర ఉండరు. స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్తారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువులు, జలాశయాలు నిండుకుండల్లా మారాయి. విద్యార్థులను ఎట్టిపరిస్థితుల్లో చెరువుల దగ్గరకు పంపించొద్దు. బయట గ్రౌండ్లలో ఆడుకోమని చెప్పాలి. ఇంట్లో కూర్చొని ఫోన్లు చూసినా.. వారి ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో బయట ఆడుకోవడానికి వెళ్లనివ్వాలి. అదే సమయంలో జాగ్రత్తగా ఉండమని వారికి సూచించాలి.
అలాగే బతుకమ్మ ఆడిన తర్వాత వాటిని చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మల నిమజ్జనం సమయంలో సైతం యువతులు, విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. నీళ్లలోనికి వెళ్లకుండా బయట నుంచే నిమజ్జనం చేయాలి. గ్రామాల్లో అధికారులు పంచాయతీ సిబ్బందిని బతుకమ్మ పండుగ రోజుల్లో సాయంత్రం పూట చెరువు వద్ద కాపలా ఉంచాలని పలువురు సూచిస్తున్నారు.
