అక్షరటుడే, వెబ్డెస్క్: Panchayat Funds | గ్రామ పంచాయతీలకు (Grama panchayats) ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి పండుగ (Sankranthi festival) వేళ రూ.277 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో పంచాయతీలకు కొంతకాలంగా నిధులు లేక పనులు నిలిచిపోయాయి. సర్పంచులు (Sarpanche) లేక పోవడంతో చాలా గ్రామాల్లో చెత్త సేకరణ సైతం నిలిచిపోయింది. ఇటీవల గ్రామాల్లో కొత్త పంచాయతీ పాలకవర్గాలు కొలులు దీరాయి. సర్పంచులు చెత్త సేకరణ, విద్యుత్ దీపాల ఏర్పాటు వంటి పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.277 కోట్లను విడుదల చేసింది.
Panchayat Funds | పండుగ శుభాకాంక్షలు
ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఈ నిధుల విడుదలకు ఆమోదం తెలుపుతూ, కొత్తగా ఎన్నికైన సర్పంచులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నిర్ణయం మేరకు, ఆర్థిక శాఖ అధికారులు గ్రామ పంచాయతీలకు రూ.277 కోట్లను విడుదల చేశారు. ప్రజాభవన్లో ఆర్థిక శాఖ అధికారుల కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ క్రమంలో పంచాయతీ నిధుల విడుదలపై నిర్ణయం తీసుకున్నారు. దీంతో కొత్తగా ఎన్నికైన సర్పంచులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.