Panchayat Funds | పంచాయతీలకు గుడ్​న్యూస్​.. రూ.277 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Panchayat Funds | గ్రామ పంచాయతీలకు (Grama panchayats) ప్రభుత్వం గుడ్​ న్యూస్​ చెప్పింది. సంక్రాంతి పండుగ (Sankranthi festival) వేళ రూ.277 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో పంచాయతీలకు కొంతకాలంగా నిధులు లేక పనులు నిలిచిపోయాయి. సర్పంచులు (Sarpanche) లేక పోవడంతో చాలా గ్రామాల్లో చెత్త సేకరణ సైతం నిలిచిపోయింది. ఇటీవల గ్రామాల్లో కొత్త పంచాయతీ పాలకవర్గాలు కొలులు దీరాయి. సర్పంచులు చెత్త సేకరణ, విద్యుత్​ దీపాల ఏర్పాటు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Panchayat Funds | గ్రామ పంచాయతీలకు (Grama panchayats) ప్రభుత్వం గుడ్​ న్యూస్​ చెప్పింది. సంక్రాంతి పండుగ (Sankranthi festival) వేళ రూ.277 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలో పంచాయతీలకు కొంతకాలంగా నిధులు లేక పనులు నిలిచిపోయాయి. సర్పంచులు (Sarpanche) లేక పోవడంతో చాలా గ్రామాల్లో చెత్త సేకరణ సైతం నిలిచిపోయింది. ఇటీవల గ్రామాల్లో కొత్త పంచాయతీ పాలకవర్గాలు కొలులు దీరాయి. సర్పంచులు చెత్త సేకరణ, విద్యుత్​ దీపాల ఏర్పాటు వంటి పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.277 కోట్లను విడుదల చేసింది.

Panchayat Funds | పండుగ శుభాకాంక్షలు

ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఈ నిధుల విడుదలకు ఆమోదం తెలుపుతూ, కొత్తగా ఎన్నికైన సర్పంచులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నిర్ణయం మేరకు, ఆర్థిక శాఖ అధికారులు గ్రామ పంచాయతీలకు రూ.277 కోట్లను విడుదల చేశారు. ప్రజాభవన్‌లో ఆర్థిక శాఖ అధికారుల కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ క్రమంలో పంచాయతీ నిధుల విడుదలపై నిర్ణయం తీసుకున్నారు. దీంతో కొత్తగా ఎన్నికైన సర్పంచులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...