అక్షరటుడే, వెబ్‌డెస్క్: Paddy Bonus | అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగ (Sankranthi festival) వేళ.. సన్న రకం వరి ధాన్యానికి బోనస్ ఇచ్చింది. పథకానికి సంబంధించి పౌరసరఫరాల శాఖ (Civil Supplies Department) నిధులను విడుదల చేసింది. పండుగ పూట ఖాతాల్లోకి బోనస్ సొమ్ము చేరుతుండడంతో రైతులు (farmers) హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Paddy Bonus | రూ. 500 కోట్ల నిధులు
సన్న రకం వరి పండించిన రైతులను ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ (Congress party) ఎన్నికల సమయంలో బోనస్ ఇస్తామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా వానాకాలం పంటలకు సంబంధించి తాజాగా రూ. 500 కోట్ల బోనస్ నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే కొందరికి డబ్బులు రాగా.. మిగిలిన వారికి తాజాగా నిధులు విడుదల చేసింది.
Paddy Bonus | ప్రస్తుత సీజన్‌లో..
ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు సన్న ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి.. ప్రభుత్వం రూ. 1,429 కోట్లను బోనస్ కింద విడుదల చేసింది. సాధారణ మద్దతు ధరతో పాటు బోనస్ సొమ్ము కూడా రావడంతో రైతులకు ఆర్థికంగా భారీ ఊరట కలుగుతోంది. సన్న రకం సాగును ప్రోత్సహించడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన సన్న బియ్యం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం బోనస్‌ను అందిస్తోంది.