Hyderabad | మందుబాబుల‌కి శుభ‌వార్త‌.. కొత్త బార్స్ వచ్చేశాయ్..

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hyderabad | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆహ్వానించిన బార్ లైసెన్స్ (Bar License) దరఖాస్తు ప్రక్రియ పూర్తి అయింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో (Greater Hyderabad area) 24 కొత్త బార్‌లు ఏర్పాటు కానున్నాయి. ఇది ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయాన్ని సమకూర్చనున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరపాలక సంస్థ (GHMC) పరిధిలో చివరి రోజున దరఖాస్తులు అందించేందుకు వ్యాపారులు పోటీ పడ్డారు. 24 బార్లకు ఏకంగా 3,525 కు పైగా దరఖాస్తులు అందినట్లు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hyderabad | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆహ్వానించిన బార్ లైసెన్స్ (Bar License) దరఖాస్తు ప్రక్రియ పూర్తి అయింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో (Greater Hyderabad area) 24 కొత్త బార్‌లు ఏర్పాటు కానున్నాయి. ఇది ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయాన్ని సమకూర్చనున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరపాలక సంస్థ (GHMC) పరిధిలో చివరి రోజున దరఖాస్తులు అందించేందుకు వ్యాపారులు పోటీ పడ్డారు. 24 బార్లకు ఏకంగా 3,525 కు పైగా దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు.

Bar License | గుడ్ న్యూస్..

జీహెచ్‌ఎంసీ (GHMC) పరిధిలోని 24 బార్లతో పాటు మహబూబ్‌నగర్‌ (Mahabubnagar), నిజామాబాద్‌ (Nizamabad), బోధన్‌ (Bodhan), జల్‌పల్లి (సరూర్‌నగర్‌) మున్సిపాలిటీల పరిధిలో ఒక్కొక్క బార్‌ ఏర్పాటుకు గత నెలలో ఎక్సైజ్‌ శాఖ (Excise Department) దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. గత నెల 15న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ.. శుక్రవారం రాత్రి వరకు కొనసాగింది. 24 కొత్త బార్ లైసెన్స్‌ల కోసం ఏకంగా 3,525 దరఖాస్తులు అందినట్లు జాయింట్ కమిషనర్ శాస్త్రి వెల్లడించారు. లక్కీ డ్రాలో బార్లు దక్కించుకున్న తమ నూతన బార్‌లను 90 రోజుల్లోగా నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ గడువు పాటించకపోతే లైసెన్సులు రద్దు అయ్యే అవకాశం ఉంది.

గ్రేటర్ హైదరాబాద్‌లోని (Greater Hyderabad) ఈ 24 బార్‌లు నగర నైట్‌లైఫ్‌కు, వినోద రంగానికి నూతన శోభను తీసుకువస్తాయి అని అంటున్నారు. ఇది పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు, స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా దోహదపడుతుంది. కొత్త వ్యాపారాలు (Merchants) ప్రారంభం కావడంతో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ఎవరైనా సరే, నిర్దేశిత అర్హతలను కలిగి ఉంటే.. బార్ లైసెన్స్ (bar license) కోసం దరఖాస్తు చేసుకునే విధంగా ప్రక్రియను సరళీకరించారు. ఈ విధానం చిన్న, మధ్య స్థాయి పెట్టుబడిదారులకు కూడా అవకాశం కల్పించింది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...