అక్షరటుడే, వెబ్డెస్క్ : Medaram Special Trains | మేడారం మహాజాతర (Medaram Jathara)కు వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు నడుపుతామని తెలిపారు.
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన వేడుకగా పేరు గాంచిన మేడారం మహా జాతర ఈ నెల 28 నుంచి 31 వరకు సాగనుంది. నాలుగు రోజుల పాటు జరిగే జాతరకు లక్షలాది మంది భక్తులు వస్తారు. జాతర ప్రారంభం కాకముందే మేడారంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఈ క్రమంలో భక్తుల సౌకర్యార్థం అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఆర్టీసీ (RTC) ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అయితే జాతర కోసం ప్రత్యేక రైళ్లు నడపాలని భక్తులు కోరారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే (SCR) తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈనెల 28, 29వ తేదీల్లో మొత్తం 28 స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు తెలిపింది.
Medaram Special Trains | ప్రత్యేక రైళ్లు నడిచే మార్గాలు
సికింద్రాబాద్ (Secunderabad) నుంచి మంచిర్యాల, మంచిర్యాల నుంచి సికింద్రాబాద్ మార్గంలో ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. అలాగే సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్గర్, నిజామాబాద్ (Nizamabad) నుంచి వరంగల్, కాజిపేట్ నుంచి ఖమ్మం, ఆదిలాబాద్ నుంచి కాజీపేట మార్గాల్లో ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. మొత్తం 28 రైళ్లు వేశారు. అయితే మేడారంలో రైల్వే స్టేషన్ లేదు. దీంతో సమీపంలోని స్టేషన్లలో భక్తులు దిగి అక్కడి నుంచి బస్సుల ద్వారా జాతరకు చేరుకోవచ్చు.